
సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 2 : ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా చీరెలు పంపిణీ చేయడం హర్షణీయమని ఎంపీపీ గుత్తా ఉమాదేవి, జడ్పీటీసీ వీరమళ్ల భానుమతిగౌడ్ అన్నారు. మండల వ్యాప్తంగా శనివారం చీరెల పంపిణీని వారు ప్రారంభించి మాట్లాడారు. మండలంలో 14వేల మందికి చీరెలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తాసీల్దార్ బ్రహ్మయ్య, ఎంపీడీఓ బండారు యాదగిరి, సర్పంచులు సికిలమెట్ల శ్రీహరి, దోనూరి జైపాల్‌రెడ్డి, సామల భాస్కర్, ఎంపీటీసీ దోనూరి శ్రావణి, ఆర్ఐ నగేశ్ పాల్గొన్నారు.
బతుకమ్మను సంతోషంగా జరుపుకోవాలి
చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ రాజు
చౌటుప్పల్ ఆడబిడ్డలు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ప్రభుత్వం చీరెలు పంపిణీ చేస్తున్నదని మున్సిపల్ చైర్పర్సన్ వెన్‌రెడ్డి రాజు అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో శనివారం మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో బతుకమ్మ సంబురాలు చేసుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె.నర్సింహారెడ్డి, వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, గుండెబోయిన వెంకటేశ్ యాదవ్, దేవరపల్లి గోవర్ధన్‌రెడ్డి, మల్లేశంగౌడ్ పాల్గొన్నారు.
భువనగిరి మండలంలో..
భువనగిరి అర్బన్ మండలంలోని ముత్తిరెడ్డిగూడెం, గంగసానిపల్లి గ్రామాల్లో శనివారం ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడబిడ్డలు సంతోషంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు ప్రభుత్వం చీరెను కానుకగా అందజేస్తున్నదన్నారు. అన్ని మతాల పండుగలకు ప్రభుత్వం కానుకలు అందజేయడం సంతోషకరమని పేర్కొన్నారు. అనంతారం గ్రామంలో సర్పంచ్ చిందం మల్లికార్జున్, తాజ్‌పూర్‌లో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ర్యాకల శ్రీనివాస్, సూరేపల్లి, కేసారం, బాలంపల్లి తదితర గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు బతుకమ్మ చీరెలు అందజేశారు.
మోటకొండూరు మండలంలో షురూ..
మోటకొండూర్ : బతుకమ్మ చీరెల పంపిణీ మండల వ్యాప్తంగా ప్రారంభమైంది. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ వద్ద సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలత, ఇక్కుర్తిలో సర్పంచ్ చామకూర అమరేందర్‌రెడ్డి మహిళలకు చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, రేషన్ డీలర్లు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.