
ఘనంగా టీఆర్ఎస్ జెండా పండుగ
పెద్దఎత్తున పాల్గొన్న పార్టీ శ్రేణులు
హోరెత్తిన జై తెలంగాణ నినాదాలు
హుజూర్నగర్, సెప్టెంబర్ 2 : టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నియోజకవర్గవ్యాప్తంగా టీఆర్ఎస్ జెండా పండుగను గురువారం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీల్లో, గ్రామాల్లో, వార్డుల్లో ప్రజాప్రతినిధులు, సర్పంచులు టీఆర్ఎస్ జెండాను ఎగురవేసి ర్యాలీలు నిర్వహించారు. హుజూర్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ లక్ష్మీనరసింహారెడ్డి పార్టీ జెండా ఎగురవేశారు. 2, 4, 8 , 10, 19, 20, 24, 25, 26, 27, 28వ వార్డుల్లో పార్టీ ఇన్చార్జిలు, కౌన్సిలర్లు గులాబీ జెండాను ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేశారు. నేరేడుచర్ల పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయం వద్ద పార్టీ పట్టణాధ్యక్షురాలు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ చల్లా శ్రీలత, పలు గ్రామాల్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చింతకుంట్ల సోమిరెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు. గరిడేపల్లి మండలం కేంద్రంలో ఎంపీపీ పెండె సుజాత, మార్కెట్ చైర్మన్ కడియం వెంకట్‌రెడ్డి, మండలాధ్యక్షుడు జోగు అరవిందరెడ్డి జెండాను ఆవిష్కరించారు. మేళ్లచెర్వు మండలంలో మండలాధ్యక్షుడు సూరిశెట్టి బసవయ్య ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. పాలకవీడు మండలంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మలమంటి దుర్గారావు జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. చింతలపాలెం, మఠంపల్లి మండల కేంద్రాల్లో మండలాధ్యక్షులు జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు గెల్లి అర్చనారవి, చందమళ్ల జయబాబు, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వర్రావు, చిట్యాల అమర్నాథ్రెడ్డి, దొంతగాని శ్రీనివాస్‌గౌడ్, అబ్దుల్ నబీఅమర్, జడ్పీటీసీ రాపోలు నర్సయ్య, డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, వైస్ ఎంపీపీ తాళ్లూరి లక్ష్మీనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇంజమూరి యశోదారాములు, గ్రంథాలయ చైర్మన్లు, సంపత్, గుర్రం మార్కండేయ, ఎంపీపీలు లకుమళ్ల జ్యోతీభిక్షం, గూడెపు శ్రీనివాస్, సర్పంచులు శంకర్‌రెడ్డి, మన్నెం శ్రీనివాస్‌రెడ్డి, సరోజిని, కీత జ్యోతీఅంజిరెడ్డి, జడ్పీటీసీలు రాపోలు నర్సయ్య, కొప్పుల సైదిరెడ్డి, కౌన్సిలర్లు ఫణికుమారి, మంజుల, గురువయ్య, పద్మ, ఆస్మానసీర్, నాగేశ్వర్రావు, మంగమ్మ, సౌజన్య, నాయకులు రత్నశ్రీ, సాయిరాంగౌడ్, హరికృష్ణ, వెంకట్‌రెడ్డి, సైదులు, లతీఫ్, మునీర్, గోపినాథ్‌రెడ్డి, పండ్ల హుస్సేన్, యడ్ల విజయ్, దొడ్డా నర్సింహారావు, దొంతగాని శ్రీనివాస్‌గౌడ్, రాంబాబు, అంజి, బాషా, సాయి, షహనాజ్, నాగవేణి, సరిత, పురుషోత్తంరెడ్డి, మహేందర్‌రెడ్డి, భారతి, మంగమ్మ, సులోచన, లలిత, శ్రీధర్, సత్యనారాయణ రెడ్డి, రమేశ్‌బాబు, సురేశ్‌బాబు, వెంకటేశ్వర్లు, రాజు, వీరయ్య, రాజేశ్, సుందరయ్య, శ్రీరాంరెడ్డి, కళావతి, గిరి, నరేశ్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా..
కోదాడ : కోదాడ నియోజకవర్గవ్యాప్తంగా టీఆర్ఎస్ జెండా పండుగను ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డులో శకుంతల థియేటర్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని వెంకటరత్నం బాబు, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ పట్టణాధ్యక్షుడు చందు నాగేశ్వర్రావు జెండాను ఆవిష్కరించారు. పట్టణ టీఆర్ఎస్ వార్డు కౌన్సిలర్లు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. టీఆర్ఎస్ నాయకులు వనపర్తి లక్ష్మీనారాయణ, పట్టణ మహిళా విభా గం అధ్యక్షురాలు ఇర్ల రోజారమణి, పట్టణ కార్యదర్శి మేకపోతుల సత్యనారాయణ, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ఎంపీపీ చింతాకవితారెడ్డి గులాబీ జెండా ను ఆవిష్కరించారు. మునగాల మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తొగరు రమేశ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. రైతు కమిటీ సభ్యులు సుంకర అజయ్‌కుమార్, సహకార సంఘం చైర్మన్ కందిబండ సత్యనారాయణ, కోల ఉపేందర్ పాల్గొన్నారు. నడిగూడెం మండలంలో ఎంపీపీ యాతకుల జ్యోతి, జడ్పీటీసీ బాణాల కవితానాగరాజు, నాగలక్ష్మి పాల్గొన్నారు. అనంతగిరిలో పార్టీ మండలాధ్యక్షుడు రమేశ్, ఎంపీపీ వెంకటేశ్వర్లు, నాయకులు బుర్రా పుల్లారెడ్డి, శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. చిలుకూరు మండలంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొండా సైదయ్య, ఎంపీపీ బండ్ల ప్రశాం తి, జడ్పీటీసీ శిరీష, దొడ్డా సురేశ్ ఆధ్వర్యంలో జెండా పండుగ జరిగింది. మోతె మండలం రావిపహాడ్‌లో టీఆర్ఎస్ నాయకులు పండ్లు పంపిణీ చేశారు. జడ్పీటీసీ పుల్లారావు, ఎంపీపీ ఆశాశ్రీకాంత్, మండలాధ్యక్షుడు శ్రీలం సైదులు ఏలూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.