
రామగిరి, సెప్టెంబర్ 29 : గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అక్టోబర్ 7న నల్లగొండ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లపై బుధవారం కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రంగనాథ్ పర్యవేక్షించారు. ఎంజీ యూనివర్సిటీని సందర్శించే అవకాశాలున్న నేపథ్యంలో వర్సిటీలో పర్యటించారు. వీసీ గోపాల్‌రెడ్డితో కలిసి సమీక్షించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటించడంతోపాటు ఎన్ఎస్ఎస్ బృందాల ఆధ్వర్యంలో బతుకమ్మ సాంస్కృతికోత్సవాలు ఏర్పాటు చేయనున్నారు. గవర్నర్ పర్యటనకు సంబంధించి అధికారికంగా షెడ్యూల్ ఇంకా వెల్లడించలేదు. ఏర్పాట్లను పర్యవేక్షించిన వారిలో ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, రెడ్‌క్రాస్ సంస్థ చైర్మన్ గోలి అమరేందర్‌రెడ్డి, తాసీల్దార్ మందడి నాగార్జున్‌రెడ్డి, డా.అల్వాల రవి, డా.దోమల రమేశ్ ఉన్నారు.