దినదినాభివృద్ధి చెందుతున్న నాగర్‌కర్నూల్
జిల్లా ఏర్పాటుతో మారిన ముఖచిత్రం
రూ.65 కోట్లతో భూగర్భ డ్రైనేజీ
రూ.50 కోట్లతో సీసీ రోడ్లు
తలమానికంగా మినీ ట్యాంక్‌బండ్
త్వరలో మెడికల్ కళాశాల ఏర్పాటు
త్వరలో మంత్రి కేటీఆర్‌తో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
స్వరాష్ట్ర కల సాకారమవుతున్నది. జిల్లా కేంద్రంగా మారిన నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ అభివృద్ధిలో పురోగమిస్తున్నది. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్య, వైద్యం వంటి రంగాల్లో కూడా మెరుగైన సేవలు
అందుతున్నాయి. రూ.65 కోట్లతో భూగర్భ డ్రైనేజీ, రూ.50 కోట్లతో సీసీ రోడ్లతోపాటు వివిధ పనులు చకచకా సాగుతున్నాయి. వచ్చే నెలలో మంత్రి
కేటీఆర్ చేతుల మీదుగా మరిన్ని పనులకు శంకుస్థాపనలు,
ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. మినీ ట్యాంక్‌బండ్,
బుద్ధ విగ్రహం జిల్లాకే తలమానికంగా నిలుస్తున్నాయి.
త్వరలో మెడికల్ కాలేజీ ప్రారంభం కానున్నది. ఇలా జిల్లా
కేంద్రం దినదినాభివృద్ధి చెందుతున్నది. నూతనంగా
ఏర్పడ్డాక జిల్లా ముఖచిత్రమే మారిపోయింది.
నాగర్‌కర్నూల్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రం అభివృద్ధిలో తనదైన ప్రత్యేకత చాటుకుంటున్నది. నాలుగేండ్ల కిందట జి ల్లాగా ఏర్పడింది. ఈ క్రమంలోప్రజలు ఆశించినదానికంటే మించి పట్టణం పురోగమిస్తున్నది. సంపూర్ణ పారిశుధ్యం కోసం రూ.65 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులు చేపడుతున్నారు. దాదాపుగా 80 శాతం పను లు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది నాటికి పనులు పూ ర్తికానున్నాయి. నాలుగు చోట్ల సులభ్ కాంప్లెక్స్‌లు ని ర్మించారు. రూ.50 కోట్ల అంచనాలతో అన్ని కాలనీ ల్లో సీసీ రోడ్ల పనులు చురుకుగా కొనసాగుతున్నా యి. ఇప్పటి వరకు రూ.20 కోట్లతో పలు కాలనీల్లో సీసీ రోడ్లు వేశారు. సమీకృత మార్కెట్ సముదాయం నిర్మించనున్నారు. రూ.7 కోట్లతో కూరగాయలు, రూ.4 కోట్లతో నాన్‌వెజ్ మార్కెట్ల నిర్మాణానికిగానూ ఇప్పటికే స్థల సేకరణ పూర్తి చేశారు. అలాగే ఉయ్యాలవాడ, శ్రీపురం చౌరస్తా, కొల్లాపూర్ చౌరస్తాల్లో రూ.1.20 లక్షలతో జంక్షన్లను నిర్మిస్తున్నారు. దీనికో సం మరో రూ.60 లక్షలు అదనంగా మంజూరు కా నున్నాయి. చిరువ్యాపారులైన స్ట్రీట్ వెండర్లను ఆదుకునేందుకు రూ.20 లక్షలతో ప్రభుత్వ జూనియర్ కా లేజీ ఎదుట స్ట్రీట్ వెండింగ్ జోన్ ఏర్పాటు చేశారు. రూ.50 లక్షలతో కొత్తగా స్ట్రీట్ వెండింగ్ జోన్ ఏర్పా టు చేయనున్నారు. ఇంటింటా సేకరించిన చెత్తను వే సేందుకు రూ.కోటితో డంపింగ్ యార్డు నిర్మించారు. రూ.1.10 కోట్లతో మున్సిపాలిటీ నూతన భవన స ముదాయం నిర్మించారు. పట్టణంలోని ఎండబెట్ల, రాంనగర్ కాలనీ, నాగనూలు రోడ్లను డబుల్ రోడ్లు గా విస్తరిస్తున్నారు. ఇక్కడ కొత్తగా సీసీ రోడ్లు వేసి, సై డ్ లైట్లతో తీర్చిదిద్దనున్నారు. ఇప్పటికే ప్రధాన రోడ్డు పై నిర్మించిన డివైడర్ పచ్చని మొక్కలతో ఆకర్షిస్తున్న ది. ఎల్ఈడీ విద్యుద్దీపాలతోపాటు రూ.10 లక్షలతో స్తంభాల చుట్టూ వేసిన బల్బులు రాత్రివేళ మరింత శోభ తీసుకొస్తున్నాయి. జెడ్పీ, జూనియర్ కళాశాల మైదానాల్లో రూ.40 లక్షలతో ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చే శారు. మినీ ట్యాంక్‌బండ్ హైదరాబాద్‌ను తలపిస్తున్న ది. రూ.20 కోట్లతో అభివృద్ధి పర్చిన కేసరి సముద్రం చెరువు కట్ట పర్యాటకంగా మారింది. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సొంతంగా రూ.45 లక్షలతో ఏర్పాటు చేసిన బుద్ధ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. ప్రతి రోజూ సాయంత్రం, సెలవు దినాల్లో ప్రజలు ఇ క్కడికి వచ్చి సేదతీరుతున్నారు. వాటర్ లైటింగ్ షో కనువిందు చేస్తున్నది. రూ.20 లక్షలతో 100 అడుగుల భారీ జాతీయ జెండాను త్వరలో ఏర్పాటు చే యనున్నారు. ఇప్పటికే స్తంభాన్ని బిగించారు. మినీ ట్యాంక్ బండ్‌కు మరిన్ని సొబగులు అద్దేలా రూ.3 కోట్ల నిధులు మంజూరు కాగా, వాటితో పాత పుట్‌పాత్ స్థానంలో గ్రైనేట్ పుట్‌పాత్, ప్రత్యేక రెయిలింగ్, ఇతర ఏర్పాట్లు చేపట్టనున్నారు. ట్యాంక్‌బండ్ కింద పార్క్ నిర్మించనున్నారు. త్వరలో బోటింగ్ సౌకర్యం కల్పించేందుకు టూరిజం శాఖతో చర్చలు జరిగాయి. ఆధునిక హంగులతో కొత్తగా పార్క్, మినీ స్టేడియం నిర్మాణాలకు స్థల సేకరణ చేపడుతున్నారు. కొల్లాపూ ర్ చౌరస్తాలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల నిర్మా ణం వేగంగా చేపడుతున్నారు. దీనికితోడు ఇటీవల జిల్లా కేంద్రానికి మంజూరైన మెడికల్ కళాశాల ప్రకటన ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చుతున్నది. వ చ్చే విద్యా సంవత్సరంలో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న దవాఖానను 300 పడకలుగా అప్‌గ్రేడ్ చేసి అభివృద్ధి చేయనున్నారు. కొల్లాపూర్ నుంచి రాయలసీమకు వెళ్లే జాతీయ రహదారి మంజూరుతోపాటు ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి తో రియల్ వ్యాపారం జోరందుకున్నది. బహుళ అం తస్తుల భవనాలు నిర్మాణమవుతున్నాయి. నాలుగేండ్లలోనే నాగర్‌కర్నూల్ పట్టణం ఊహించని స్థాయిలో అభివృద్ధి చెందింది. ఇలా చేపట్టిన, చేపట్టబోతున్న ప నులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను త్వర లో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా చేపట్టేందుకు ఎమ్మెల్యే చర్యలు చేపడుతున్నారు.
ఏడాదిలోగా అన్ని పనులు పూర్తి..
జిల్లా కేంద్రంపై ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. రూ.కోట్లాది నిధులను మంజూరు చేయిస్తున్నారు. ఏడాదిలోగా భూగర్భ డ్రైనేజీ పూర్తవుతుంది. రూ.50 కోట్లతో పట్టణంలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు నిర్మిస్తున్నాం. మినీ ట్యాంక్‌బండ్ సుందరీకరణ చేపడుతున్నాం. ఏడాదిలోగా దాదాపుగా అన్ని పనులు పూర్తవుతాయి.
మంత్రి కేటీఆర్‌తో ప్రారంభోత్సవం..
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చే సేందుకు కృషి చేస్తున్నా. జిల్లా కేంద్రం లో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలతోపాటు కొత్తగా చేపట్టబో యే పనులకు శంకుస్థాపనలను త్వరలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా నిర్వహిస్తాం. రాష్ట్రంలోనే నాగర్‌కర్నూల్‌ను ప్రత్యేకంగా నిలిచేలా పనిచేస్తా.