బిజినేపల్లి, ఆగస్టు 20 : ఇటీవల కురిసిన వర్షాలకు అల్లీపూర్ కుంట జలకళను సంతరించుకున్నది. గ్రామానికి సమీపంలో ఉన్న ఈ కుంటలో గతంలో కొద్దిపాటి నీరు మాత్రమే ఉండేది. కాగా ప్రస్తుతం కురిసిన వర్షాలకుతోడు సమీపంలోని కేఎల్ఐ కాలువతో నీటితో కళకళలాడుతున్నది. ఈ కుంటలో ఒండ్రుమట్టిని తొలగించడం వల్ల ఎక్కువ మొత్తంలో నీరు నిలిచింది. దీంతో గ్రామంలోని బోరుబావుల్లో నీటి మట్టం పెరిగిందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.