నాగర్‌కర్నూల్, ఆగస్టు 19: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ వేడుకలను నాగర్‌కర్నూల్‌లో తాలూకా ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ కూడలిలో కెమెరా సృష్టికర్తలు లూయిస్ డాగురే, జోసఫ్ నెఫ్సీ, టాల్బట్ చిత్రపటాలకు ఫొటోగ్రాఫర్లు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ఫొటోగ్రాఫర్స్ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, ప్రధానకార్యదర్శి చెన్నకేశవులు, తాలూకా అధ్యక్షుడు వీరేందర్‌గౌడ్, ప్రధానకార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి కుర్మయ్య, సీనియర్ ఫొటోగ్రాఫర్స్ మాజీ అధ్యక్షుడు రమేశ్, గోవర్ధన్, నేతాజీగౌడ్, మల్లేశ్, పాషా, కమిటీ సభ్యులు బురాన్, నర్సింహ, శేఖర్, నరేశ్, దేవాగౌడ్, వెంకటేశ్, ఫొటోగ్రాఫర్లు సలాం, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.
వంగూరు మండలంలో..
వంగూరు, ఆగస్టు 19: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మండలకేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఫొటోగ్రాఫర్ల ఆధ్వర్యంలో కెమెరా సృష్టికర్త లూయిస్ డాగూరే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఫొటోగ్రాఫర్ల సంఘం మండల అధ్యక్షుడు రమేశ్‌తోపాటు ఫొటోగ్రాఫర్లు నవీన్, కొండల్, గణేశ్, భీమయ్య, మహేశ్, విష్ణు, శ్రీను, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఊర్కొండ మండలంలో..
ఊర్కొండ, ఆగస్టు 19: మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఫొటోగ్రాఫర్లు ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫొటోగ్రఫీకి ఆధ్యుడు లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మండలకేంద్రంలో మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్రమంలో ఫొటోగ్రాఫర్ల సంఘం మండల ప్రధాన కార్యదర్శి సిద్ధు, ప్రచార కార్యదర్శి శ్రీకాంత్, సహాయ కార్యదర్శి రాజుతోపాటు ఫొటోగ్రాఫర్లు బాలు, చలపతి ఉన్నారు.