అచ్చంపేట, ఆగస్టు 15: నల్లమలలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఆదివారం నిరాడంబరంగా నిర్వహించారు. అచ్చంపేట, కొల్లాపూర్ డివిజన్లోని మండలాలు, గ్రామాల్లో జాతీయ జెండా రెపరెపలాడింది. అచ్చంపేట క్యాంపు కార్యాలయం వద్ద విప్ గువ్వల బాలరాజు, ఆర్డీవో కార్యాలయం వద్ద ఆర్డీవో పాండునాయక్, వ్యవసాయ మార్కెట్ యార్డులో చైర్మన్ సీఎంరెడ్డి, మున్సిపల్ కార్యాలయం వద్ద నర్సింహగౌడ్, తాసిల్దార్ కార్యాలయం వద్ద తాసిల్దార్ చంద్రశేఖర్, ప్రెస్‌క్లబ్ వద్ద అధ్యక్షుడు చందునాయక్, వస్త్ర వ్యాపార సంఘం భవనం వద్ద అధ్యక్షుడు పులిజాల రమేశ్, పోలీస్‌స్టేషన్ ఎదుట డీఎస్సీ నర్సింహులు, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ శాంతభాయి, ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ఎదుట డీఈ హేమలత, అటవీశాఖ కార్యాలయం వద్ద డీఎఫ్‌వో కృష్ణగౌడ్, గిరిజన భవనం వద్ద అధ్యక్షుడు గోపాల్‌నాయక్, ఫొటోగ్రాఫర్ల సంఘం అధ్యక్షుడు నారాయణ, ప్రభుత్వ దవాఖాన వద్ద డాక్టర్ కృష్ణ తదితర కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శైలజావిష్ణువర్ధన్రెడ్డి, ఎంపీపీ శాంతాలోక్యనాయక్, జెడ్పీటీసీ మంత్రియా, మాజీ చైర్మన్ తులసీరాం, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కొల్లాపూర్, ఆగస్టు 15: ఎందరో ప్రాణాత్యాగ ఫలితమే నేడు స్వాతంత్య్ర ఫలాలను పొందుతున్నామని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. అమరుల ఆశయ సాధనకోసం ప్రతిఒక్కరూ పునరంకితమవ్వాలని పిలుపునిచ్చారు.75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయం, సివిల్ దవాఖానలో జాతీయ నేతల చిత్రపటాలకు పూలమాల వేసి ఎమ్మెల్యే బీరం జాతీయ జెండాను ఎగురవేశారు. పట్టణ శివారులోని మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో ఎమ్మెల్యే బీరం పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో జెండా ఎగురవేసిన మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు అంబేద్కర్, మహాత్మగాంధీ, తెలంగాణ తల్లి, బాబూజగ్జీవన్‌రాం విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. పోలీసుల గౌరవవందనం చేయగా తాసిల్దార్ కార్యాలయం వద్ద తాసిల్దార్ షౌకత్ అలీ, రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఆర్డీవో హనుమానాయక్ జెండాఎగురవేశారు. ప్రధాన జూనియర్ కోర్టు వద్ద జూనియర్ సివిల్ జడ్జి మురళీమోహన్ జెండావిష్కరించారు. కోర్టు వద్ద నిర్వహించిన కార్యక్రమానికి ద్వితీయ శ్రేణి జడ్జి విజయకుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, సీనియర్ న్యాయవాదులు బాలీశ్వరయ్య, శ్రీనివాస్‌రావు, ఉపేందర్, వసంతరెడ్డి, ఏపీపీ మనోహర్, న్యాయవాదులు పాల్గొన్నారు. అలాగే పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సీఐ వెంకట్‌రెడ్డి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ భోజ్యానాయక్, మున్సిపల్ కార్యాలయంలోనూ, అల్లూరిసీతారామరాజు విగ్రహం వద్ద మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీచారి, మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ నరేందర్‌రెడ్డి, ఆర్టీసీ డిపోలో డీఎం వరప్రసాద్‌గౌడ్, ఎక్సైజ్ కార్యాలయం వద్ద సీఐ ఏడుకొండలు, అటవీశాఖ రేంజ్ కార్యాలయంలో ఎఫ్ఆర్వో ఎల్లయ్య, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాల్లో మువ్వెన్నల జెండాలు రెపరెపలాడాయి.
కొల్లాపూర్ రూరల్, ఆగస్టు 15: 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ ఎదుట మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. మేజర్ గ్రామ పంచాయతీ సింగోటం, కుడికిళ్ల, ఎనమెట్ల ,జావాయిపల్లి, మాచినేనిపల్లి, సోమశిల, చింతలపల్లి, రామాపురం, అమరగిరి, బోడబండ తండా, ఎల్లూరు, ముక్కిడిగుండం, నార్లాపూర్, మొలచింతపల్లి, అంకిరావుపల్లి, లక్ష్మీనాయక్తండాల్లో ఆయా సర్పంచులు జెండాలు ఎగురవేశారు. కార్యక్రమాల్లో ఆయా గ్రామాల వార్డుసభ్యులు, ప్రముఖులు హాజరయ్యారు.
పెద్దకొత్తపల్లి, ఆగస్టు 15: మండల కేంద్రంలోని తాలసిల్దార్ కార్యాలయం వద్ద తాసిల్దార్ శ్రీనివాసాచారి, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ ప్రతాప్‌గౌడ్, వివిధ ప్రభుత్వ, పైవేట్ కార్యాలయాల వద్ద ఆయా అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గౌరమ్మ, ఎంపీటీసీలు రవికుమార్, రేణుక, శశికళ, సర్పంచ్ వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణవేణి, రాధ, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నాగరాజు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నాగరాజు, మండల నాయకులు శ్రీనివాసులు, చంద్రయ్య, రాజశేఖర్, మాజీ సర్పంచ్ నర్సింహా తదితరులు ఉన్నారు.
పెంట్లవెల్లి, ఆగస్టు 15: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ ఎదుట ఎస్సై శివశంకర్, సింగిల్ విండో కార్యాలయం ఎదుట చైర్మన్ విజయరామారావు, వెలుగు కార్యాలయం ఎదుట ఏటీఎం గౌసోద్దీన్, వెటర్నరీ దవాఖాన వద్ద పశువైద్యాధికారి వినయ్‌కుమార్, పీహెచ్సీ ఎదుట డాక్టర్ చంద్ర శేఖర్, ఎంపీడీతో కార్యాలయం ఎదుట ఎంపీపీ ఉమామహేశ్వరి, తాసిల్దార్ కార్యాలయం వద్ద తాసిల్దార్ రమేశ్, గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట సర్పంచ్ సువర్ణమ్మ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ చిట్టెమ్మ, ఎంపీటీసీ సుమలత, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సురేందర్‌గౌడ్ రాజేశ్, హనుమంతు, జిల్లా కోఆప్షన్ సభ్యులు మతీన్, నాయకలు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
అమ్రాబాద్, ఆగస్టు 15: మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలు, యువజన సంఘాలు వివిధ పార్టీ కార్యకర్తలు తమ కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అటవాశాఖ కార్యాలయంలో రోహిత్ గోపిడి, తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ మారుతి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో భరత్‌సింహ, పోలీస్‌స్టేషన్‌లో సీఐ బీసన్న, వివేకానంద విగ్రహం వద్ద యూత్ అధ్యక్షుడు శ్రీనివాసులు, టీఆర్ఎస్ కార్యాలయం ఎదుట వార్డు మెంబర్ జగన్ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎంపీపీ శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ ప్రణీత, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
ఉప్పనుంతల, ఆగస్టు 15: స్థానిక తాసిల్దార్ కార్యాలయం వద్ద తాసిల్దార్ కృష్ణయ్య, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ అరుణ, సింగిల్‌విండో వద్ద చైర్మన్ భూపాల్‌రావు, గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ సరిత, పీహెచ్సీ వద్ద వైద్యాధికారి తారాసింగ్, పశువైద్యశాల వద్ద నరేందర్, వివిధ కార్యాలయాల వద్ద అధికారులు జెండాను ఎగురవేశారు.
లింగాల, ఆగస్టు 15: ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ లింగమ్మ, తాసిల్దార్ కార్యాలయంపై తాసిల్దార్ మునీరొద్దీన్, సింగిల్ విండో కార్యాలయం వద్ద చైర్మన్ హన్మంత్‌రెడ్డి, పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై కృష్ణయ్య, ఉన్నత పాఠశాల ఆవరణలో హెచ్ఎం శేఖర్, వ్యవసాయ శాఖ కార్యాలయం ఆవరణలో ఏవో నాగార్జునరెడ్డి జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో సర్పంచ్ తిరుపతయ్య, వైస్ చైర్మన్ వెంకటగిరి, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యదర్శులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బల్మూరు, ఆగస్టు 15 : ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ అరుణ, తాసిల్దార్ కార్యాలయం వద్ద తాసిల్దార్ కిష్ట్యనాయక్, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై రాజు, పంచాయతీ కార్యాలయాల వద్ద తిరుపతిరావు, ప్రియాంకాగణేశ్, సహదేవు, శివశంకర్, రేవతి, పాఠశాలలు, కళాశాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు.