నేటి నుంచి చేప పిల్లలు విడుదల
వంద శాతం సబ్సిడీతో పంపిణీ
చేయూతనందిస్తున్న ప్రభుత్వం
సంపద సృష్టిస్తున్న చేపలు
ఇక గ్రామాల్లోనూ అగ్గువకే..
మత్స్యకారుల్లో సంబురం
ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో నీలి విప్లవం కొనసాగుతున్నది. మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు వంద శాతం సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది. ప్రతి ఏడాది కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది. ఈ సారి కూడా చెరువులు, రిజర్వాయర్లలో జల పుష్పాలను విడుదల చేసేందుకు మత్స్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం సంబురంగా చేపట్టే కార్యక్రమం బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభంకానున్నది. ఇక అన్ని చెరువుల్లోకి చేప పిల్లలు చేరనున్నాయి. వదిలిన చేప పిల్లలు పెరిగి మత్స్య సంపద సృష్టించనున్నాయి. దీంతో మార్కెట్లో అగ్గువకే చేపలు లభిస్తుండగా.. సర్కారు చర్యలతో మత్స్యకారుల్లో ఆనందం నెలకొన్నది.
నాగర్‌కర్నూల్ (నమస్తే తెలంగాణ)/గద్వాల, సెప్టెంబర్ 7 : రాష్ట్ర ప్రభుత్వం చేతి, కులవృత్తుల కు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నది. కల్లు గీత, చేనే త, బీడీ కార్మికులతోపాటు గొర్రెల కాపరులు, నా యీ బ్రాహ్మణులు, రజకులకు వివిధ సంక్షేమ ప థకాలు అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా మత్స్యకారులనూ ఆదుకుంటున్నది. చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు వంద శాతం సబ్సిడీతో చేపపిల్లలను చెరువుల్లో వదులుతున్నది. ప్రతి ఏ డాది వర్షాకాలంలో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో నిండుగా నీళ్లు ఉన్న సమయంలో చే పపిల్లల పంపిణీ చేపడుతున్నది. వర్షాలు జోరుగా కురుస్తుండడంతో అన్ని నీటి వనరులు దాదాపు గా నిండుకుండలను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి రాష్ట్రంలో చేప పిల్లల ను వదిలేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మ త్స్యకారుల సంక్షేమానికి ఆర్థిక సాయంతోపాటు మత్స్యకార భవనాలు నిర్మిస్తున్నది. చేపల తరలింపునకు ఆటోలు, ద్విచక్రవాహనాలనూ పంపి ణీ చేసింది. చేపల మార్కెట్ల నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో మత్స్యకారులకు చేపల పెంప కం లాభాల సిరిగా మారింది. ఫలితంగా వారాంతపు సంతల్లోనే లభించే చేపలు సొంతూళ్లలోనే ప్రతిరోజూ లభిస్తున్నాయి. సాధారణ చేపలు కిలో రూ.100 నుంచి రూ.120కే దొరుకుతున్నాయి. ఆరోగ్యకరమైన చేపల కూరపై ప్రజలు ఆసక్తి పెం చుకోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర దుకాణాల్లోనూ చేపల ఫ్రై సాధారణ మెనూగా మా రింది. చేపల పెంపకంలో పారదర్శకత ఉండేందు కు జియో ట్యాగింగ్ చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఏడు నెలల పాటు నీళ్లు ఉండే చెరువులను జియో ట్యాగ్ చేసేందుకు మత్స్యశాఖ సిద్ధమైంది.
చేప పిల్లల రకాలు..
జోగుళాంబ గద్వాల జిల్లాలోని చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో మూడు రకాల చేప పిల్లలు వదిలేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం నుంచి చేప పిల్లలను కొనుగోలు చేసి తీసుకొచ్చారు. కుంటలు, చెరువుల్లో 35-40 ఎంఎం సైజు ఉన్న చేప పిల్లలు వదలనున్నారు. రిజర్వాయర్లు, ప్రాజెక్టుల్లో 80-100 ఎంఎం వరకు ఉండనున్నాయి. 35-40 ఎంఎం సైజు ఉండే చేప పిల్లలను రూ.65 పైసలు చొప్పున, 80-100 ఎంఎం సైజు చేప పిల్లలను రూ.1.70 పైసలకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. చెరువులు, కుంటల్లో కట్ల, రోగు, బంగారుతీగ చేపలు, రిజర్వాయర్లలో కట్ల, రోగు, మిగ్రాల జాతికి చెందిన చేపపిల్లలు విడుదల చేయనున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో..
నాగర్‌కర్నూల్ జిల్లాలో 170 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 14,539 మంది సభ్యు లు ఉన్నారు. 1,473 చెరువులు, శ్రీశైలం, సింగో టం, ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లి రిజర్వాయర్లలోనూ చేపపిల్లలు వదులుతున్నారు. శ్రీశై లం బ్యాక్ వాటర్, డిండి రిజర్వాయర్‌లో 829 మంది మత్స్యకారులకు లైసెన్స్‌లు ఇచ్చారు. ఇక 11 చేపల చెరువులకుగానూ ఐదు చెరువుల ని ర్మాణం పూర్తైంది. బుధవారం నుంచి చేప పిల్లలు వదలనుండడంతో మత్స్యకారుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. 2017-2018లో 1,421 చెరువుల్లో 1.27 కోట్ల చేపపిల్లలు వదిలారు. 2018-2019లో 1,464 చెరువుల్లో 1.58 కో ట్లు, 2019-2020లో 1,473 చెరువుల్లో 2.15 కోట్లు, 2020-2021లో 1,473 చెరువుల్లో 2.41 కోట్ల చేపపిల్లలు వదిలారు. ఈ ఏడాది 1,473 చెరువుల్లో 2.99 కోట్ల చేపపిల్లలను అధికారులు వదలనున్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో..
జోగుళాంబ గద్వాల జిల్లాలో గతేడాది కోటి పదిహేను లక్షల చేపపిల్లలను చెరువులు, కుంట లు, రిజర్వాయర్లలో వదిలారు. ఈ ఏడాది 453 చెరువులు, కుంటలు, 9 రిజర్వాయర్లలో కలిపి 2.33 కోట్ల చేప పిల్లలు వదిలేందుకు మత్స్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 9న జిల్లా కేంద్రంలోని సంగాల చెరువులో చేపపిల్లలు వదిలేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చెరువులు, కుంటల్లో 105.06 లక్షలు, రిజర్వాయర్లలో 128.75 లక్షల చేపపిల్లలు వదలనున్నారు. జిల్లాలో 63 మత్స్యకార సహకార సంఘాలు ఉండగా 5,153 మంది సభ్యులు ఉన్నారు. వీరితో పాటు లైసెన్స్ ఉన్న మత్స్యకార్మికులు 1500 మంది వరకు ఉన్నారు.
నేడు చేప పిల్లల పంపిణీ..
జిల్లాలో ఈ ఏడాది 1,473 చెరువుల్లో 2.99 కోట్ల చేప పిల్లలు విడుదల చేసేందుకు కార్యాచరణ రూపొందించాం. చెరువులు, రిజర్వాయర్లన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. అందుకే ప్రభుత్వ ఆదేశంతో బుధవారం జిల్లా కేంద్రంలోని నాగనూలు నాగసముద్రంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా చేపపిల్లల పంపిణీ ప్రారంభిస్తున్నాం. చేపల పెంపకంతో మత్స్యకారులను ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు ప్రజల ఆరోగ్యానికి మంచి మాంసం అందుతుంది.
అన్ని ఏర్పాట్లు చేశాం..
ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేపడుతున్నది. ఈ నెల 9వ తేదీన సంగాల చెరువులో చేపపిల్లలు వదలనున్నాం. విడుతల వారీగా జిల్లాలోని అన్ని చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో చేప పిల్లలు వదులుతాం. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.