ఎస్సీ, ఎస్టీ వాడల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి
సౌకర్యాల కల్పనపై ప్రణాళికలు
విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ ఇతర పనులపై నివేదిక
నాగర్కర్నూల్ జిల్లాలో రూ.321 కోట్లతో అంచనా..
సర్కారుకు నివేదించిన పీఆర్ అధికారులు
దళిత, గిరిజన వాడల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ వాడల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు తీసు కోవాల్సిన చర్యలు, నిధుల అంచనాలపై ఆదేశాలు జారీ చేసింది. దీంతో పంచాయతీరాజ్ శాఖ
అధికారులు ఆయా వాడల్లో వారంపాటు పర్యటించి అక్కడ కావాల్సిన విద్యుత్
దీపాలు, స్తంభాలు, డ్రైనేజీ, రోడ్ల నిర్మాణాలకు అంచనాలను రూపొందించారు.
నాగర్కర్నూల్ జిల్లాలో రూ.321 కోట్లతో పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ శాఖ
ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించింది. త్వరలో నిధులు మంజూరు
కానుండగా దళిత, గిరిజన ప్రాంతాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందనున్నాయి.
నాగర్కర్నూల్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం దళిత, గిరిజన ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి న డుం బిగించింది. ఇందులో భాగంగా పంచాయతీరాజ్ శాఖకు ఆయా ప్రాంతాల్లో మౌ లిక సమస్యల పరిష్కారం కోసం ఏమేం చ ర్యలు చేపట్టాలో అనే వివరాలు సేకరించిం ది. పీఆర్ ఇంజినీరింగ్ శాఖ అధికారులు స మస్యలను జాబితా తయారు చేశారు. ఆ యా ప్రాంతాల్లో చేపట్టాల్సిన మురుగు కా ల్వలు, సీసీ రోడ్లు, విద్యుత్ బల్బులు, స్తం భాల ఏర్పాటుపై అంచనాలు రూపొందించారు. దీని ప్రకారం భవిష్యత్లో ఈ ప్రాంతాల్లోని స మస్యలు తీర్చేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయనున్నది. అంచనాల మేరకు త్వరలో నిధులు రానున్నాయి. దళిత, గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం గురుకులాలు ఏర్పాటు చేసింది. హాస్టళ్లలో ఉచిత వసతి కల్పిస్తున్నది. విదేశాల్లో చదువుల కోసం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పేరిట రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నది. కార్పొరేట్ కళాశాలల్లోనూ ఉచిత చదువు చెప్పిస్తున్నది. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా ఉపాధి కోసం రుణాలు మంజూరు చేస్తున్నది. ఆడపిల్లల పెండ్లిళ్ల కోసం కల్యాణలక్ష్మి, కులాంతర వివాహాలకు ఆర్థిక సాయం అందజేస్తున్నది. రైతాంగాన్ని ప్రోత్సహించేందుకు పాడి గే దెల పంపిణీతోపాటు భూ అభివృద్ధి, బోర్లు వేయ డం, పందిరి కూరగాయల వంటి పథకాలు అమలు చేస్తున్నది. ఇక త్వరలో రూ.10లక్షల ఆర్థిక సాయం అందించే దళితబంధు పథకం కూడా అమలు కానున్నది. త్వరలో గిరిజనులకు కూడా అమలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇలా దళిత, గిరిజనుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఓ వైపు చర్య లు తీసుకుంటూనే.. తాజాగా దళిత, గిరిజన నివాస ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపడుతునారు. చాలా ప్రాంతాలు గ్రామాలకు దూరంగా ఉండడంతో అభివృద్ధి ఆశించినంతగా జరగడం లేదు. దీంతో ఆయా కాలనీల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణంతో పాటు స్తంభాలకు విద్యుత్ బల్బులు బిగించనున్నది. దీనికోసం పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేయగా, అధికారులు వారం రోజుల పాటు ఆయా కాలనీల్లో పర్యటించారు. రోడ్లు, మురుగు కాల్వలు, విద్యుత్ స్తంభాలపై అంచనాలు రూపొందించారు. నాగర్కర్నూల్ జిల్లాలో పీఆర్ అధికారులు రూ.321 కోట్లతో నిర్మాణాలకు ప్రణాళికలు తయారుచేశారు. ప్రభుత్వం త్వరలో నిధులు మంజూరు చేయనుండడంతో దళిత, గిరిజన ప్రాంతాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందనున్నాయి.
ప్రభుత్వానికి నివేదించాం..
ప్రభుత్వం దళిత, గిరిజన వాడల అభివృద్ధికి చ ర్యలు తీసుకుంటున్నది. ఆయా ప్రాంతాల్లో నూతనంగా సీసీ రోడ్లు, మురు గు కాల్వల నిర్మాణం, వి ద్యుత్ స్తంభాల ఏర్పాటు కు ప్రతిపాదనలు తయా రు చేశాం. నాగర్కర్నూల్ జిల్లాలో రూ.321కోట్ల అంచనాలతో తయారు చేసిన నివేదికలను ప్రభుత్వానికి పంపించాం.
నాగర్కర్నూల్ జిల్లాలో రూపొందించిన ప్రణాళిక
నిర్మించాల్సిన సీసీ రోడ్లు 5,15,786 మీటర్లు
అంచనా వ్యయం రూ.206.31 కోట్లు
మురుగు కాల్వలు 3,66,374 మీటర్లు
అంచనా వ్యయం రూ.109.91 కోట్లు
ఏర్పాటు చేయాల్సిన
స్తంభాలు 5,008
అంచనా వ్యయం రూ.5 కోట్లు