నాగర్‌కర్నూల్, ఆగస్టు 13 : 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ మనూచౌదరి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో వేడుకలపై వివిద శా ఖల వారీగా శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఈసారి పతాకావిష్కరణకు ముఖ్య అ తిథిగా ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజును ప్రభుత్వం నియమించిందన్నారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే వేడుకల్లో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, ఉద్యానవనం, వైద్య, ఆరోగ్యశాఖ, అటవీ, జిల్లా స్త్రీశిశు సంక్షేమ శాఖల ప్రగతి ప్రతిబింబించేలా శకటాలను ఏర్పాటు చేయాలన్నారు. పల్లెప్రగతి, ఆరోగ్యం, ఐసీడీఎస్, విద్య, డీఆర్డీఏ, సంక్షేమ, పశుసంవర్ధకశాఖకు చెందిన స్టాళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నా రు. జిల్లాలో అత్యుత్తమ సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసాపత్రా లు అందజేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆయ శాఖల జిల్లా ఉన్నతాధికారులు తమ శాఖల వారీగా ఉత్తమ ఉద్యోగుల పేర్లను వెంటనే అందజేయాలన్నారు. ప్రతి మండ లం నుంచి 3 ఉత్తమ పంచాయతీల వివరాలను అందించాలని డీపీవోను ఆదేశించారు. స్వాతంత్య్ర వేడుకలకు శనివారం సాయంత్రంలోగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అన్ని శాఖలకు చెందిన కోర్టు కే సులు, లోకాయుక్త, ఆర్టీఐ కేసుల వివరాల తేదీలను ఒకరోజు ముందుగానే పూర్తిస్థా యి నివేదికలను తనకు తెలియజేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి సు ధాకర్లాల్, డీఈవో గోవిందరాజులు, డీఆర్డీడీవో నర్సింగరావు, డీపీవో రాజేశ్వరి, జిల్లా అధికారులు అనిల్‌ప్రకాశ్, రమాదేవి, రాంలాల్, భూపాల్‌రెడ్డి, వెంకటలక్ష్మి, నాగలక్ష్మి, అన్వేష్ పాల్గొన్నారు.
2020 ఫిబ్రవరి 10న జిల్లాకు అదనపు కలెక్టర్‌గా స్థానిక సంస్థల హోదాలో వచ్చిన మనూచౌదరి శుక్రవారం పూర్తిస్థాయి పాలనాధికారిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం పలువురు జిల్లాస్థాయి అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు ఆయనకు పుష్పగుచ్ఛాలు, మొక్కలు అందించి అభినందనలు తెలిపారు. బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో జాకీర్‌అలీ, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రణాళికాశాఖ రూపొందించిన జిల్లా గణాంక సంకలనం-2020 పుస్తకాన్ని శుక్రవారం సాయంత్రం కలెక్టర్ మనూచౌదరి ఆవిష్కరించారు. గణాంక సంకలనంలో జిల్లాకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన సమాచార వివరాలు ఉంటాయని, ఈ పుస్తకాన్ని బ్యాంకులు, ప్రజాప్రతినిధులు, జిల్లాస్థాయి అధికారులకు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి భూపాల్‌రెడ్డి, గణాంక అధికారి రఘునందన్, గణాంక సిబ్బంది పాల్గొన్నారు.
స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ మనూచౌదరి అధికారులను ఆదేశించారు. ఈమేరకు శుక్రవారం సాయంత్రం అధికారులతో కలిసి పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీవో నాగలక్ష్మి, తాసిల్దార్ గోపాల్, ఆర్ఐ నారాయణరాజు, డిప్యూటీ తాసిల్దార్ ఖాజా తదితరులు ఉన్నారు.
కందనూలు, ఆగస్టు 13 : నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మనూ చౌదరిని సీపీఎం నాయకులు శుక్రవారం కలెక్టరేట్లో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు, సభ్యులు శ్రీనివాస్, గీత, అశోక్, రామయ్య, కాశన్న పాల్గొన్నారు.