బిజినేపల్లి, డిసెంబర్ 2: అభాగ్యులకు అండగా సీఎం సహాయనిధి నిలుస్తుందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నా రు. మండలంలోని లట్టుపల్లి గ్రామానికి చెందిన భారతి అనారోగ్యానికి గురై మెరుగైన వైద్య చికిత్స కోసం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నది. ప్రభుత్వం నుంచి రూ.2 లక్షల ఎల్వోసీ మంజూరు కాగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తిమ్మాజిపేట మండలంలోని నేరళ్లపల్లిలోని గ్రామంలోని తన నివాసంలో బాధిత కుటుంబసభ్యులకు శుక్రవారం అందజేశారు. అదేవిధంగా మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన మహేశ్ మూత్రపిండాల వ్యా ధితో బాధపడుతుండగా అతడికి ఆపరేషన్ నిమిత్తం రూ. లక్షా 50వేల ఎల్వోసీ ప్రభుత్వం నుంచి మంజూరు కాగా ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్ బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఫులేందర్రెడ్డి, వెంకట్‌రెడ్డి, శేఖర్‌గౌడ్, వెంకటేశ్, ఎంపీటీసీ రఘుమారెడ్డి, యాదవరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, ఖదీర్ ఉన్నారు.
తాడూరు, డిసెంబర్ 2 : మండలంలోని ఎట్టిధర్పల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్‌గౌడ్ కొన్ని రోజులుగా బ్రెయిన్లో నరాల సంబంధిత సమస్యతో కంటిచూపు కోల్పోయాడు. మెరుగైన వైద్య చికిత్స చేయించుకోలేకపోవడంతో స్థానిక నేతలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లా రు. హైదరాబాద్ నిమ్స్ దవాఖానలో వెంకటేశ్‌గౌడ్‌కు మెరుగైన వైద్య చికిత్స కోసం సీఎం సహాయనిధి నుంచి ఎమ్మెల్యే మర్రి సహకారంతో రూ.2.50లక్షల ఎల్వోసీ మంజూరు కాగా బాధిత కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే మర్రి శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యార రమేశ్, ప్రధానకార్యదర్శి రాజుగౌడ్, నాయకులు తిరుపతిరెడ్డి, శేఖర్‌గౌడ్, వెంకట్‌రెడ్డి, అనిల్‌రెడ్డి ఉన్నారు.
తిమ్మాజిపేట, డిసెంబర్ 2 : మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులను శుక్రవారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పరామర్శించారు. భార్యను కోల్పోయిన శ్రీనును పరామర్శించి ఘటన వివరాలను తెలసుకున్నారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం మరికల్లో తండ్రిని కోల్పోయిన పార్టీ నాయకుడు జగదీశ్వర్‌ను పరామర్శించి కుటుంబసభ్యులతో మాట్లాడారు. వెంకాయపల్లిలో గాయపడిన సీనియర్ నాయకుడు నర్సిరెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆయన వెంట ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి, జెడ్పీటీసీ దయార్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జోగు ప్రదీప్, వైస్ ఎంపీపీ శ్రీనివాసులు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు వేణుగోపాల్‌గౌడ్, రైతుబంధు సమితి కన్వీనర్ వెంకటస్వామి, ఎంపీటీసీ బాలయ్య, వెంకటస్వామి, జైపాల్‌రెడ్డి, స్వామి, బాలరాజు పాల్గొన్నారు.
బిజినేపల్లి, డిసెంబర్ 2: మండలకేంద్రంతోపాటు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన అయ్యప్పస్వాములు శుక్రవారం తిమ్మాజిపేట మండలంలోని నేరళ్లపల్లిలోని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈనెల 9న బిజినేపల్లిలోని ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఏకశిల పదునెట్టంబడి మొదటి వార్షికోత్సవం ఉంటుందని, మహాపడిపూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఎమ్మెల్యేకు ఆహ్వానపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఫులేందర్రెడ్డి, శ్రీను, శంకర్, అశోక్ తదితరులు ఉన్నారు.