బన్సీలాల్‌పేట్ : బోనాల జాతరలో భాగంగా న్యూబోయిగూడలోని శ్రీబద్ది పోచమ్మ, ముత్యాలమ్మ దేవాలయం తరఫున బల్గం జగదీశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మవారి ఫలహారం బండిని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పశు, పాడి పరిశ్రమ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. మేకపొట్టేళ్ళ వాహనంపై అమ్మవారి విగ్రహాన్ని పెట్టి, పోతరాజుల ఆటపాటలు, డప్పు వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఫలహారం బండిని ఊరేగించారు. సినీ నటి గీతాసింగ్, టీఆర్ఎస్ ఇన్చార్జి జి.పవన్‌కుమార్ గౌడ్, అధ్యక్షుడు వెంకటేశన్ రాజు, తలసాని ధర్మేందర్ యాదవ్, రవీందర్ యాదవ్, కోఆర్గనైజర్ మిట్టపల్లి జగ్గయ్య, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.