
తూప్రాన్/రామాయంపేట, సెప్టెంబర్ 5: రామాయంపేట మున్సిపల్ వార్డుల వారీగా టీఆర్ఎస్ కమిటీలను ఈనెల10 లోగా పూర్తి చేస్తామని రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, టీఆర్ఎ స్ పట్టణాధ్యక్షుడు పుట్టి యాదగిరి అన్నారు. ఆదివా రం రామాయంపేట పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రా మాయంపేట మున్సిపల్లో ఉన్న 12 వార్డులకు నేటి నుంచి అన్ని వార్డులకు కమిటీలను ఖరారు చేస్తామన్నారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పార్టీ గుర్తిస్తుందన్నారు.సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, చంద్రపు కొండల్‌రెడ్డి, కన్నాపురం కృష్ణాగౌడ్, నాగేశ్వర్‌రెడ్డి, మల్యాల కిషన్, మెట్టు యాదగిరి, రాజు, మహేశ్, రాజు ఉన్నారు,
మున్సిపల్లో రెండు వార్డు కమిటీల ఎన్నిక: తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రవీందర్‌గౌడ్
తూప్రాన్ మున్సిపల్లోని 1, 2 వార్డులకు టీఆర్ఎస్ నూతన కమిటీలు వేశామని తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రవీందర్‌గౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సతీష్‌చారి అన్నారు.1వ వార్డు అధ్యక్షుడిగా షేక్సత్తార్, మైనార్టీ అధ్యక్షుడిగా ఎం. షారుక్, మ హిళా కమిటీ అధ్యక్షురాలిగా నస్రీన్, ఎస్సీ కమి టీ అధ్యక్షుడిగా రాజేశ్, బీసీ కమిటీ అధ్యక్షుడిగా నవీన్‌ను ఎన్నుకున్నారు 2వ వార్డు కమిటీ అధ్యక్షుడిగా ఆంజనేయులు, మహిళా కమిటీ అధ్యక్షురాలిగా స్వరూప, యువజన విభాగం అధ్యక్షుడిగా రవి, బీసీ కమిటీ అధ్యక్షుడిగా సతీష్‌యాదవ్, ఎస్సీ కమిటీ అధ్యక్షుడిగా ప్రవీణ్‌ను ఎంపిక చేసినట్లు చైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌ న్సిలర్ వెంకటేశ్, సీనియర్ నాయకులు వెంకటేశ్, సత్తార్, హజర్, షారు క్, ఇమ్రాన్లు ఉన్నారు.