
మెదక్/ మెదక్ మున్సిపాలిటీ , ఆగస్టు 27 : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని ప్రతిష్ఠించి పూజించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుమ్మరి సంఘం జిల్లా భవన నిర్మాణానికి రెండు ఎకరాలు కేటాయించి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆ సంఘంరాష్ట్ర అధ్యక్షుడు బాలకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు గోపాల్, కోశాధికారి మల్లేశం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు మట్టి గణపతి విగ్రహాన్ని అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలందరూ మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకొని పూజించాలని కోరారు. మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేయడంతో కుల వృత్తులపై ఆధారపడిన కుమ్మరులకు కరోనా నేపథ్యంలో ఎంతో సహకారం అందుతుందని అన్నారు. ప్రజలకు పంపిణీ చేసేందుకు 2వేల విగ్రహాలను తయారు చేసి సెప్టెంబర్ 5న తనకు అందజే యాలని ఎమ్మెల్యే కుమ్మరి సంఘం నాయకులకు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, కౌన్సిలర్లు జయరాజ్, కిశోర్, శ్రీనివాస్, హవేళీఘనపూర్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, రామాయంపేట జడ్పీటీసీ సంధ్య, పీఏసీఎస్ చైర్మన్ చంద్రం, నిజాంపేట ఎంపీపీ సిద్ధిరాములు, టీఆర్ఎస్ నా యకులు రాగి అశోక్, లింగారెడ్డి, ముత్యంగౌడ్, సంపత్, బా ల్ రారెడ్డి, రాజు, మధు, నవీన్, సుభాష్ పాల్గొన్నారు.
పాపన్నపేట,ఆగస్టు 27: ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని అబ్లాపూర్లో మట్టి వినాయకుల తయారు చేస్తున్న బ్రహ్మనందం, లత దంపతుల ఇంటికి ఆమె వెళ్లి మట్టి వినాయకుల తయా రీ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో 1000 మట్టి వినాయకులను తయారు చేసి మెదక్ మున్సిపాలిటీలో ప్రజలకు పంపిణి చేసేవారని వెల్లడించారు. ఈ సారి మెదక్ మున్సిపాలిటీ ద్వారా 2000 నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట మున్సిపాలిటీల ద్వారా ప్రతి మున్సిపాలిటీకి 1000 వినాయకుల చొప్పున పంపిణీ చేయాలని ఆమె సూ చించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో వెయ్యి మట్టి వినాయకులను తయారు చేసి కలెక్టర్ కార్యాలయం లో పంపిణీ చేయాల్సిందిగా ఆమె సూచించారు. జిల్లాలోని 39 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం ఐదు వేల మూ డు వందల మట్టి వినాయకులను పంపిణీ చేయాలని జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి జగదీశ్‌ను ఆదేశించారు. ఈసారి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 11,300 మట్టి వినాయ కులను పంపిణీ చేయాలని సంబంధిత అధికారిని ఆదేశించారు.