
ప్రొటెంచైర్మన్ వెన్నవరం భూపాల్‌రెడ్డి
రామచంద్రాపురం, ఆగస్టు 27: ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం భారతీనగర్ డివిజన్లోని ఎల్‌ఐజీలో పోచమ్మ ఆలయ స్వాగత తోరణం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, కార్పొరేటర్ సింధూఆదర్శ్‌రెడ్డితో కలిసి ప్రొటెం చైర్మన్ స్వాగత తోరణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల వారి ప్రార్థన మందిరాల అభివృద్ధికి కృషి చేస్తున్నదన్నారు. రాష్ర్టానికే తలమానికమైన యాదాద్రి ఆలయాన్ని అద్భుత క్షేత్రంగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నదన్నారు. ఆధ్యాత్మిక చింతనతోనే మనస్సుకు ప్రశాంతత కలుగుతుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలోని ఆలయాలు, మసీద్‌లు, చర్చిలు టీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ప్రజలందరూ భక్తి మార్గంలో నడిచినప్పుడే సమాజంలో శాంతి నెలకొంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పుష్పానగేశ్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, గోదావరి, సత్యనారాయణ, యాదగిరిరెడ్డి, యాదిరెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.