
పారిశ్రామిక విప్లవాన్ని తెచ్చేందుకు తెలంగాణ సర్కారు యోచిస్తున్నది. ఇందులో భాగంగా జహీరాబాద్ మండలం బుచినెల్లి శివారులో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసింది. 314ఎకరాల స్థలాన్ని కేటాయించి, టీఎస్ఐఐసీకి అప్పగించింది. ఇక్కడ మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమ యాజమాన్యం ప్రోత్సాహంతో అనుబంధంగా పరిశ్రమలు ఏర్పాటు చేయగా, వంద పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం వ్యాపారులను ప్రోత్సహిస్తున్నది. కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యమిస్తుండగా, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం లభించనున్నది.
జహీరాబాద్, ఆగస్టు 26 : జహీరాబాద్ ప్రాంతం జాతీయ రహదారిపై, రైల్వే స్టేషన్ ఉండడంతో పారిశ్రామల ఏర్పాటు చేసేందుకు వ్యాపారులు ముందుకొస్తున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా భారీ పరిశ్రమ ఉండడంతో దాని అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేశారు. టీఎస్ఐఐసీ జహీరాబాద్ మండలంలోని బుచినెల్లి శివారులో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేసి, పారిశ్రమల ఏర్పాటుకు స్థలాలు కేటాయించింది. బుచినెల్లి శివారులో టీఎస్ఐఐసీకి 314 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమ యాజమాన్యం ప్రోత్సాహంతో అనుబంధంగా పరిశ్రమలు ఏర్పాటు చేశారు. వంద పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం వ్యాపారులను ప్రోత్సహిస్తున్నది. పరిశ్రమలు ఏర్పాటు చేసే వ్యాపారులకు భూమి, మౌలిక సదుపాయాలు కలిపించడంతో పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్‌లోని కాటేదాన్‌లో ఉన్న ఆయిల్ మిల్లులను బుచినెల్లి టీఎస్ఐఐసీకి తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
పారిశ్రామికంగా జహీరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. పరిశ్రమలు స్థాపించేందుకు సీఎం కేసీఆర్ ప్రోత్సహించడంతో భారీగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. బుచినెల్లి శివారులోని పారిశ్రామికవాడలో మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమ యాజమాన్యం ప్రోత్సాహంతో అనుబంధంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. వంద పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వ్యాపారులు ముందుకొచ్చారని టీఎస్ఐఐసీ అధికారులు తెలిపారు. వ్యాపారులకు కావాల్సిన భూమి, మౌలిక సదుపాయాలు కల్పించి, సిద్ధం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగులకు ఉపాధి కలిపించేందుకు చర్యలు తీసుకుంటున్నది. జహీరాబాద్ పట్టణం జాతీయ రహదారిపై ఉండడంతో పారిశ్రామిక వేత్తలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని టీఎస్ఐఐసీ అధికారులు చెబుతున్నారు. రైల్వేలైన్, 65వ జాతీయ రహదారి ఉండడంతో పరిశ్రమలు స్థాపించేందుకు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. మహీంద్రాకు అనుబంధంగా వంద పరిశ్రమలు స్థాపించేందుకు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని సమాచారం. వంద పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించడంతో పరిశ్రమల నిర్మాణం జోరుగా సాగుతున్నది. మహీంద్రాలో ఉత్పత్తి చేస్తున్న వాహనాలకు సంబంధించిన పరికరాలు తయారు చేసేందుకు అనుబంధంగా నిర్మాణలు చేస్తున్నారు. బుచినెల్లి శివారులో ఉన్న 314 ఎకరాల్లో పరిశ్రమకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రోడ్లు వేశారు. నీటి సౌకర్యం కల్పించారు. విద్యుత్ సరఫరా చేసేందుకు సబ్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. పరిశ్రమల్లో ఉత్పత్తి చేసిన పరికరాలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు రవాణా సౌకర్యం ఉండడంతో మహారాష్ట్ర నుంచి పరిశ్రమలు స్థాపించేందుకు అధికంగా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడుతున్నారు. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో అధికారులు పనులు చేస్తున్నారు. జహీరాబాద్‌ను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది.
కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఎలాంటి రసాయన పరిశ్రమలు స్థాపించడం లేదు. మహీంద్రా అండ్ మహీంద్రా అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. మహీంద్రాలో వాహనాలు ఉత్పత్తి చేస్తారు. దీంతో ఎలాంటి రసాయనాలు ఉండవు. వాహనాల ఉత్పత్తికి కావాల్సిన పరికరాలు మాత్రమే ఇక్కడ ఉత్పత్తి అవుతాయి. ప్రభుత్వం జహీరాబాద్‌ను పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. హైదరాబాద్‌లోని కాటేదాన్‌లో ఉన్న ఆయిల్ పరిశ్రమలను బుచినెల్లి శివారులోని పారిశ్రామిక పార్కులో ఏర్పాటు చేసేందుకు టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, టీఎస్ఐఐసీ ఎండీ నరసింహారెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ బుచినెల్లి పారిశ్రామిక పార్కును పరిశీలించారు. కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు స్థలాలు గుర్తించారు.
జహీరాబాద్ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుంది. కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు టీఎస్ఐఐసీ కొత్త పద్ధతిలో శిక్షణ ఇచ్చేందుకు ముందుకొస్తున్నది. బుచినెల్లి శివారులో ఉన్న పారిశ్రామిక పార్కులో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు టీఎస్ఐఐసీ కృషి చేస్తున్నది. కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నది.