
అంగన్వాడీ సిబ్బందికి 30శాతం వేతనం పెంపు
మూడోసారి వేతనాలు పెంచిన ప్రభుత్వం
అంగన్వాడీల్లో వెల్లివిరుస్తున్న ఆనందం
స్వరాష్ట్రంలో ఏడేండ్లలో మూడుసార్లు
జూలై 1 నుంచి పెంచిన వేతనాలు అమలు
అంబరాన్నంటిన వేతన సంబురాలు
సీఎం కేసీఆర్కు అంగన్వాడీల కృతజ్ఞతల
అంగన్వాడీలకు 30 శాతం వేతనం పెంపు
మెదక్ రూరల్, ఆగస్టు 20 : అంగన్వాడీలకు రాష్ట్ర సర్కారు మరోసారి వేతనాలను పెంచి సముచిత స్థానం కల్పించింది. అంగన్వాడీ టీచర్లకు రూ.10,500 నుంచి రూ.13,650కి, మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు రూ.6వేల నుంచి రూ.7,800కు పెంచింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30 శాతం జీతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన వేతనాలు జూలై నెల నుంచి అమల్లోకి వచ్చే అవకాశముంది. మెదక్ జిల్లాలో అంగన్వాడీ టీచర్లు 847 మంది, మినీఅంగన్వాడీ టీచర్లు 181మంది , 526 ఆయాలకు లబ్ధి చేకూరనున్నది. గత ప్రభుత్వాలు వెట్టిచాకిరీ చేయించుకొని తమ బాగోగులను పట్టించుకోలేదని, తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ మూడుసార్లు వేతనాలు పెంచారని, ఆయనకు రుణపడి ఉంటామని చెబుతున్నారు
పెంపు ఇలా..
తెలంగాణ సర్కారు ఏడేండ్లలో అంగన్వాడీలకు మూడు సార్లు వేతనాలు పెంచింది. రాష్ట్రం ఆవిర్భవించిన 9 నెలలకు అంగన్వాడీ టీచర్లుకు రూ.4200 నుంచి 7వేలు, మినీ అంగన్వాడీలు, ఆయాలకు రూ.2.200 నుంచి రూ.4500 వేతనాలు పెంచింది. 2017 ఫిబ్రవరి 27న అంగన్వాడీ టీచర్లు, ఆయాలను సీఎం కేసీఆర్ ప్రగతి భవన్కు పిలిపించి, కలిసి భోజనం చేశారు. వారి సాదకబాధకాలను తెలుసుకొని, తక్షణమే అంగ
న్వాడీ కార్యకర్తల వేతనాన్ని రూ.7వేల నుంచి రూ.10500 పెంచా రు. మినీ అంగన్వాడీలు ఆయాలకు సంబంధించిన నెలసరి వేతనం రూ.4.500 నుంచి రూ.6వేలకు రెండోసారి పెంచారు. అంగన్వాడీ కార్యకర్తలుగా పిలువబడే వారిని అంగన్వాడీ టీచర్లుగా మారుస్తూ సర్కారు నిర్ణయం తీసుకున్నది. ఉద్యోగులకు ఇటీవల 30శాతం ఫిట్మెంట్ ప్రకటించిన సందర్భంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, అంగన్వాడీ, ఆశ తదితర వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఫిట్మెంట్ వర్తింపజేస్తామని సర్కారు ప్రకటించింది. ఇందులో భాగంగానే బుధవారం స్త్రీ, శిశు సంక్షేమశాఖ రాష్ట్ర స్పెషల్ కార్యదర్శి దివ్య దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు.
సంతోషంగా ఉంది.
మా సేవలను గుర్తించి, వేతనాలు పెంచడం సంతోషంగా ఉంది. వేతనాల పెంపుతో మా ఇబ్బందులు తీరినట్టే. చాలీచాలని జీతాలతో గతంలో ఇబ్బందులు పడ్డాం. గత ప్రభుత్వ లు మా వేతనాల గురించి పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ మా ఇబ్బందులు గుర్తించి వేతనాలు పెంచారు. చిన్నారులకు గర్భిణులకు, బాలింతలకు రెట్టింపు సేవ చేస్తాం.
తల్లీబిడ్డల సంక్షేమం కోసం పాటుపడాలి
అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ప్రభుత్వం సముచిత స్థానం ఇచ్చి వేతనాలు పెంచింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పీఆర్సీ ఇవ్వ డం సంతోషం. పెంచిన వేతనలు జూలై నుంచి అమలు కానుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా తల్లీబిడ్డల సంక్షేమం కోసం పాటు పడాలి.
వేతనాల పెంపు హర్షనీయం
ప్రభుత్వం అంగన్వాడీలకు 30శాతం వేతనాలు పెంచడం హర్షనీయం. గత ప్రభుత్వలు అంగన్వాడీల సమస్యలను పట్టించుకోకపోవడంతో ఇబ్బందులకు గురయ్యేవాళ్లం. సీఎం కేసీఆర్ అంగన్వాడీ సమస్యలను తెలుసుకొని, ఏడేండ్లలో రూ.2,200 నుంచి రూ.13650కు పెంచ డం ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
మెదక్ జిల్లాలో ఇలా..
ప్రధాన కేంద్రాలు : 885
మినీ కేంద్రాలు : 191
మొత్తం అంగన్వాడీ కేంద్రాలు : 1076
అంగన్వాడీ టీచర్లు : 847
మినీ అంగన్వాడీ టీచర్లు : 181
అంగన్వాడీ హెల్పర్లు : 248 మంది