
మెదక్ టౌన్ మిషన్ కో ఆర్డినేటర్ సునీత,
మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్
రామాయంపేట, ఆగస్టు 19: అర్హులైన ఎస్సీ లబ్ధిదారులకే ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ రుణాలను అందజేస్తున్నదని మెదక్ టౌన్ మిషన్ కో ఆర్డినేటర్ సునీత, రామాయంపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్ అన్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఎస్సీ కార్పొరేషన్ ఆన్లైన్ దరఖాస్తు దారుల ఇంటర్వ్యూలకు 17మంది హాజరైనట్లు తెలిపారు. దరఖాస్తుల పరిశీలించామని ఇంటర్వ్యూ చేసిన వాటిని జిల్లా కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. ఇంటర్వ్యూలకు రామాయంపేటకు చెందిన బ్యాంకర్లు ఆంధ్రా బ్యాంకు, ఏపీజీవీబీ, ఎస్బీహెచ్ బ్యాంకులకు చెందిన మేనేజర్లు హాజరైనట్లు తెలిపారు.