
పాపన్నపేట,ఆగస్టు19: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాపన్నపేటలో గురువారం ఫొటో,వీడియోగ్రాఫర్ యూ నియన్ ఆధ్వర్యంలో ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. లూయిస్ డ్యాగురే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో యూనియన్ సభ్యులు నర్సాగౌడ్, శ్రీకాంత్, ఆంజనేయులు ఉన్నారు.
చిన్నశంకరంపేటలో…
చిన్నశంకరంపేట, ఆగస్టు 19: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని చిన్నశంకరంపేటలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఫొటోగ్రఫీ సృష్టికర్త లూయిస్ డ్యాగురే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరో గ్య కేంద్రంలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం మండల అధ్యక్షడు మహే శ్ మాట్లాడుతూ ఫొటోగ్రాఫర్లు చర్రితకు వారుదులు అన్నారు.కార్యక్రమం లో ఫొటో, వీడియోగ్రాఫర్ల సంఘం మండలాధ్యక్షుడు కుమ్మ రి మహేశ్, ఉపాధ్యాక్షుడు మల్లేశంగౌడ్, సం ఘం సభ్యులు నర్సింహులు, శేఖర్, షాదు ల్లా, శ్రీను, నరేందర్, వెంకటి పాల్గొన్నారు.