
వెల్దుర్తి, /చేగుంట/మనోహరాబాద్ / కొల్చారం/ కౌడిపల్లి ఆగస్టు 15 స్వాతం త్య్ర దినోత్సవ వేడుకలు అన్నిమండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో ,ప్రభుత్వం కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదివారం జాతీయ జెండాను ఎగుర వేశారు. వెల్దుర్తి, మాసాయపేట తహసీల్దార్ కార్యాలయాల వద్ద తసీలార్లు సురేశ్, మాలతి, ఎంపీపీ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ స్వరూప, పోలీస్‌స్టేషన్ ఎస్సై మహేందర్, ఎమ్మార్సీ కార్యాలయం వద్ద ఎంఈవో యాదగిరి, వ్యవసాయ కార్యాలయం వద్ద ఏవో మాలతి, పంచాయతీ కార్యాలయాల వద్ద సర్పంచ్‌లు, పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండా ఎగురవేశారు . కొల్చారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ ఉమ, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ మం జుల, రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దార్ చంద్రశేఖర్‌రావు, పొలీస్ స్టేషన్ వద్ద ఎస్సై శ్రీనివాస్‌గౌడ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ రమేశ్, వ్యవసాయ కార్యాలయం వద్ద ఏవో బాల్‌రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. కౌడిపల్లిలో పంచాయితీ కార్యాలయం, పోలీస్‌స్టేషన్, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, ఎంపిడిఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, పంచాయితీరాజ్ డివిజన్ కార్యాలయం, ఎంఈవో కార్యాలయాలో అధికారులు ,ప్రజాప్రతినిధులు జెండాను ఆవిష్కరించారు. రామాయంపేట గ్రంథాలయం వద్ద జిల్లా డైరెక్టర్ ,మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మీ మున్సిపల్ కార్యాలయం వద్ద చైర్మన్ పల్లె జితేంద్రగౌడ్ జాతీయ జెండా ను ఎగురవేశారు . మనోహరాబాద్ మండలం కాళ్లకల్‌లో ఇన్చార్జి సర్పంచ్ కాళిదాస్ ,చేగుంట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎంపీపీ మాసుల శ్రీనివాస్,జడ్పీటీసీ శ్రీనివాస్,సర్పంచుల ఫోరం మండలఅధ్యక్షుడు శ్రీనివాస్,తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో ఉమాదేవి జాతీయ జెండాను ఎగురవేశారు