
డీఆర్డీ వో శ్రీనివాస్, డీపీవో తరుణ్
కొల్చారం, ఆగస్టు 11: సంగాయిపేటలో పార్కు అభివృద్ధిలో గ్రామస్తుల కృషి ఉందని వారిని డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో తరుణ్ అభినందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సంగాయిపేటలోని వేంకటేశ్వరగుట్టపై ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని బుధవారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మానస మాట్లాడుతూ గ్రామంలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వేంకటేశ్వరగుట్ట ఆక్రమణలకు గురి కాగా, అప్పటి కలెక్టర్ ధర్మారెడ్డి సహకారంతో పార్కు ఏర్పాటుకు గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. వేంకటేశ్వర దేవస్థాన అభివృద్ధి కమిటీ వేసి గుట్టపై పార్కును ఏర్పాటు చేయడంతో పాటు శ్రీ మాధవానంద స్వామి సూచనలతో వేంకటేశ్వరస్వామి దేవాలయ పునర్నిర్మాణం, అంజనాద్రి, భూలక్ష్మమ్మ అమ్మవార్ల దేవాలయాలను నిర్మిం చినట్లు వివరించారు. దీంతో సంతృప్తి వ్యక్తం చేసిన డీఆర్డీవో, డీపీవోలు పార్కు ఏర్పాటుకు ముందు ఫొటోలు, పార్కు ఏర్పాటయ్యాక ఫొటోలను తీసుకొని రెండు రోజుల్లో కలెక్టరేట్ రావాలని సర్పంచ్‌కు సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మౌనిక, గ్రామస్తులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్థికి ప్రభుత్వం కృషి
వెల్దుర్తి, ఆగస్టు 11: గ్రామాల అభివృద్ధికి సర్కారు కృషి చేస్తుందని ఎంపీపీ స్వరూప అ న్నారు. బుధవారం మండలంలోని మన్నెవారి జలాల్పూర్లో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనంలో సర్పంచ్ లత, ఎంపీడీవో జగదీశ్వరాచారి, ఎంపీవో తిరుపతిరెడ్డి, నాయకులు నరేందర్‌రెడ్డి, కృష్ణలతో కలిసి మొక్కలు నా టారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను రూపొందిస్తు అమలు చేస్తున్నారన్నారు. నేరుగా పంచాయతీలకు నిధులు విడుదల చేస్తూ పంచాయతీల బలోపేతానికి కృషి చేస్తూన్నారన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. ప్రతి పంచాయతీ పల్లెప్రకృతి వనం తో పాటు, మండలంలో 10 ఎకరాల విస్తీర్ణంలో బృహత్ పల్లెప్రకృతి వనాల ఏర్పాటుతో గ్రామాలు అకుపచ్చ తోరణాలుగా మారుతాయన్నారు. కార్యక్రమంలో టీఏ సంతోశ్, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.