కౌడిపల్లి/ నర్సాపూర్, ఆగస్టు 10: దేశంలో ఆకలి చావులు ఉండొద్దనేదే ఆహార భద్రత చట్టం-2013 ఉద్దేశమని ఆహార భద్రత కమిషన్ చైర్మన్ తిరుమల్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, నర్సాపూర్ పట్టణంలోని రేషన్ దుకాణాలు, పాఠశాల, అదే మండల పరిధిలోని తుల్జారాంపేట్లోని అంగన్వాడీ కేంద్రాన్ని వేర్వేరుగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 927 ప్రసూతి జరిగిన వారికి కేసీఆర్ కిట్లు అందజేస్తున్నారా? ఒకవేళ అందకపోతే లోపం ఎక్కడుందో తెలుసుకొని లబ్ధిదారులకు సహకరించాలని వైద్యులకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలు, తల్లులు, శిశువులకు పౌష్టికాహారం అందజేస్తున్నారా? అని వైద్యాధికారి వెంకట్‌స్వామి, లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడి కష్టాల్లో ఉన్న వారికి ఆహార భద్రత కల్పించి ఆరోగ్యవంతమైన మానవ సంపద పెంచేందుకు ఆహార భద్రతకు చట్ట రూపం కలిగించి, చట్ట పరమైన హక్కులను కల్పించిందన్నారు. ఆహార భద్రత చట్టం 2013 అమలు జరుగుతున్న తీరుతెన్నులను పరిశీలించడానికి నర్సాపూర్ డివిజన్లోని రేషన్ దుకాణాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. రేషన్ సరఫరాలో లోపాలు, లోటుపాట్లు, నిర్లక్ష్యం ఉండకుండా పౌరులకు సక్రమంగా సరుకులు అందేలా చూడాలని డీలర్లకు సూచించారు. సరుకుల సరఫరాలో అవకతవకలు ఉంటే విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సక్రమంగా బియ్యం అందేలా అధికారులు జాగ్రత్త వహించాలని తెలిపారు. ఆయన వెంట కార్యక్రమంలో డీఎస్వో శ్రీనివాస్, డీఆర్డీవో శ్రీనివాస్, ఆర్డీవో సాయిరాం, డిఫ్యూటీ డీఎంహెచ్‌వో విజయనిర్మల, సీడీపీవో హేమభార్గవి, ఇన్చార్జి తహసీల్దార్ తబితారాణి, అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.