
పర్యావరణానికి తీవ్రనష్టం కలిగిస్తున్న సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందుకోసం జిల్లాస్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ కమిటీల ఏర్పాటుకు ఆదేశించింది. కమిటీల ఏర్పాటుతో పాటు ప్లాస్టిక్ నియంత్రణకు యుద్ధప్రాతిపదికన కార్యాచరణ ఖరారు చేయాలని సూచించింది. ఈ కమిటీ రెండు నెలలకోసారి సమావేశమై చర్యలు తీసుకుంటుంది. నోడల్ డిపార్ట్మెంట్గా మున్సిపల్ శాఖ వ్యవహరించనుంది. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌పై వచ్చే ఏడాది జూలైలోగా నిషేధం విధించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించనున్నారు.
మెదక్ మున్సిపాలిటీ, సెస్టెంబర్ 9 : పర్యావరణానికి తీవ్రనష్టం కలిగిస్తున్న సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్రస్థాయిలో చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీ వేసిన ప్రభుత్వం.. జిల్లాస్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆగస్టు 25న ఆదేశించించింది. దీంతో కమిటీల ఏర్పాటుతో పాటు ప్లాస్టిక్ నియంత్రణకు వెంటనే కార్యాచరణ ఖరారు చేయాలని సీడీఎంఏ సత్యనారాయణ మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాస్థాయి అధికారులతో కలెక్టర్ అధ్యక్షతన ప్లాస్టిక్ నియంత్రణపై టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలో మున్సిపల్, అటవీ, పర్యావరణ, పరిశ్రమలు, పంచాయతీరాజ్ , పాఠశాల విద్య, ఉన్నత విద్య, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖల అధికారులు సభ్యులుగా ఉండనున్నారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నియంత్రణ కార్యాచరణపై కమిటీ రెండు నెలలకోసారి తప్పనిసరిగా సమావేశం కావాల్సి ఉంటుంది. ఈ కమిటీకి నోడల్ డిపార్ట్మెంట్గా మున్సిపల్ శాఖ వ్యవహరించనుంది. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌పై వచ్చే ఏడాది జూలైలోగా నిషేధం విధించనున్నట్లు కేంద్రం ఆగస్టు 13న ప్రకటించింది. 2022 డిసెంబర్ నుంచి 120 మైక్రాన్ల కంటే ఎక్కువ పరిమాణంలో గల వాటినే వాడాలని సూచించింది. ప్లాస్టిక్‌ను శాశ్వతంగా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం సూచించినది.ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ కవర్లు, వస్తువులతో కలుగుతున్న పర్యావరణ దుష్పరిణామాల నేపథ్యంలో వచ్చే ఏడాది జూలై నుంచి పూర్తిగా వాడకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధ్దమవుతున్నది. కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్( సీడీఎంఏ) నుంచి మున్సిపాలిటీలకు ఆదేశాలు రావడంతో ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్దేశిస్తున్న ప్రమాణాలకు అనుగుణంగా మార్కెట్లో ప్లాస్టిక్ కవర్లు కనిపించకుండా కఠిన చర్యలు తీసుకోవడానికి సన్నద్ధ్దమవుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 17 మున్సిపాలిటీలు..
ఉమ్మడి మెదక్ జిల్లాలో 17 మున్సిపాలిటీలు ఉన్నా యి. సిద్దిపేట జిల్లాలో 5, మెదక్ జిల్లాలో 4, సంగారెడ్డి జిల్లాలో 8 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో నిత్యం వందలాది మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా, ఈ చెత్తలో 20శాతం మేరకు ప్లాస్టిక్ కవర్లు, సంచు లు, ప్లాస్టిక్ వస్తువులే ఉంటున్నాయి. వాస్తవానికి ప్లాస్టిక్ సంచులు, వస్తువులపై నిషేధానికి ఉమ్మడి రాష్ట్రంలో 20 13 జూన్ 20న జీవో అమల్లోకి వచ్చింది. అప్పట్లో మున్సిపాలిటీలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి అవగాహన ర్యాలీ లు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. మున్సిపాలిటీల్లోని పారిశుధ్య విభాగాల ఆధ్వర్యంలో ఆకస్మిక దాడు లు నిర్వహించి వ్యాపారులకు జరిమానాలు సైతం విధించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 2016 డిసెంబర్ 30న మళ్లీ జీవో 79 అమలు చేశారు. ప్లాస్టిక్ కవర్లు, గ్లాసు లు, ప్లేట్లు విక్రయించే హోల్‌సేల్ వ్యాపారులపై మున్సిపల్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకుని జరిమానాలు విధించారు. ఈ మధ్య కాలం లో కరోనా కారణంగా దాడులు లేకపోవడంతో ప్లాస్టి క్ వినియోగం ఎక్కువైంది. ప్రస్తుతం కేంద్రం తాజా ఉత్తర్వులు వెలువరించడంతో మున్సిపల్ అధికారులు పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
ఆదేశాలు వచ్చాయి..
ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించేందుకు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్( సీడీఎంఏ) నుంచి నుంచి ఆదేశాలు వచ్చాయి. కలెక్టర్ నేతృత్వంలో జిల్లాస్థాయి స్పెషల్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించేందుకు కృషి చేస్తుంది.
-శ్రీహరి, మున్సిపల్ కమిషనర్, మెదక్
ప్లాస్టిక్‌తో పర్యావరణానికి ముప్పు..
ప్లాస్టిక్ రక్కసితో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్నది. ఏకకాలంలో వినియోగించి పారేసే వ్యర్థాలతో జీవరాశులుకు నష్టం కలుగుతున్నది. వాడుతున్న ప్లాస్టిక్‌లో 9శాతం రీసైక్లింగ్ అవుతుండగా, 12శాతం కాల్చేస్తున్నారు. మిగిలిన 79 శాతం భూమి పొరల్లోకి వెళ్తున్నది. ‘పర్యావరణ పరిరక్షణ చట్టం-1986’లోని ప్లాస్టిక్ వ్యర్థాలపై 20 16లో సవరించిన నిబంధనల ఆధారంగా 50 మైక్రాన్ల కంటే తక్కున పరిమాణం కలిగిన ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధాజ్ఞలు ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నుంచి 75 మైక్రాన్లు ఉన్నవాటిని, వచ్చే ఏడాది డిసెంబర్ నుంచి 120 మైక్రాన్ల మందం వాటినే వినియోగించాలని తాజాగా కేంద్రం స్పష్టం చేసింది.