
పెద్దశంకరంపేట, ఆగస్టు 8: బోనాల ఉత్సవాలు ఆదివారం పెద్దశంకరంపేటలోని రాణి శంకరమ్మ గడికోటలో గ్రామస్తులు వైభవంగా నిర్వహించుకున్నారు. స్థానిక (చావిడి) సరస్వతి శిశు మందిర్ నుంచి గడికోటలోని దుర్గామాత అమ్మవారికి శివసత్తుల నృత్యాలతో, గ ట్టాల ఊరేగింపుతో భక్తులు అమ్మవార్లకు బో నాలను సమర్పించారు. దారి పొడువునా శివసత్తుల నృత్యాలతో, పోతురాజుల విన్యాసాల తో బోనాలను ఊరేగింపు నిర్వహించారు. శం కరమ్మ గడికోటకు భక్తులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున రావడంతో భక్తులతో కిటకిట లాడింది. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, పట్టణ సర్పంచ్ సత్యనారాయణ, ఎంపీటీసీ వీణా, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు రాములు, ఉపస్పంచ్ దశరథ్, వేణుగోపాల్గౌడ్, గడికోట ఉత్సవకమిటీ భాద్యులు కిష్టారెడ్డి, పున్నయ్య, నాగయ్య, మల్లేశం, రవివర్మ, కృష్ణమూర్తి పాల్గొన్నారు.
మెదక్రూరల్ ,ఆగస్టు 8: మెదక్ మండల పరిధిలోని మంబోజిపల్లి శివారులోని మల్లికార్జున స్వామి ఆలయంలోఆషాడంమాసం చివరి ఆదివారంఅమావాస్య పురస్కరించుకోని భక్తులతో జనసందడిగా మారింది. స్వామి కి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు