
రామాయంపేట, ఆగస్ట్టు 8 : మెదక్ జిల్లాలోని అన్ని మండలాల్లో వానకాలం సాగు పనులు జోరుగా సాగుతున్నాయి. కురుస్తున్న వర్షాలతో భూగర్భ జలాలు పెరగడంతో పంటలు సాగుచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 3.95లక్షల ఎకరాల్లో భూమి పంటలకు అనుకూలంగా ఉంది. ప్రస్తుతం 3.29 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో వానకాలంలో 1.92లక్షల ఎకరాలు వరి , 7365 మొక్కజొన్న, 69556 ఎకరాల పత్తి, 9315 ఎకరాల కంది, 3954 పెసర, 1069 ఎకరాల మినుములు, 330 ఎకరాల చెరుకు, 212 ఎకరాల కూరగాయలను రైతులు సాగు చేస్తున్నారు. ప్రధాన పంటలే కాకుండా ఆరుతడి పంటలను సాగు చేసుకునేందుకు రైతులు ముందుకు సాగుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో పంటలపై ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. వానకాలంలో కంది పంటలు వేసుకుంటే అధిక దిగుబడి రావడమే కాకుండా రోగాలు దరిచేరవని అధికారులు తెలుపుతున్నారు. దీంతో రైతులు ఆరుతడి పంటతోపాటు కూరగాయల పంటలను సాగుచేస్తున్నారు.
వరినాట్లు ఆలస్యమైతే వానకాలం వడగళ్లు వాన వచ్చే ప్రమాదం ఉంటుందని వ్యవసాయశాఖ ఆధ్వర్యం లో రైతులకు సూచనలు చేస్తున్నాం. రైతులు పం టలు వేసి నష్టాలకు గురి కాకుండా ప్రభుత్వం అధికారులతో సర్వేలు తెప్పించుకుంటున్నది. జిల్లా వ్యాప్తంగా వానకాలం సీజన్లో రైతులు ఎక్కువగా వరి సాగుచేస్తున్నారు. సబ్సిడీపై ఎరువులు, విత్తనాలను సరఫరా చేస్తున్నాం. రైతులు వేసుకునే పంటల వివరాలను సంబంధిత అధికారులకు అందజేయాలి.
పంట దిగుబడి కోసం రైతులు విచ్చల విడిగా రసాయ ఎరువులను వేయకుండా అధికారుల సూచనలను పాటించాలి. వరినాట్లు వేసే రైతులు ఎకరాకు బస్తా డీఏపీ దుక్కిలో వేసుకోవాలి. ఎకరాకు 15కిలోల పొటాశ్, 10కిలోల జింకు వేసి ఎకరాకు కిలో గుళికలను చల్లాలి. నారు మునిగే వరకు నీళ్లు పెట్టవద్దు. నాటు వే సిన మూడోరోజు లోపు కలుపు మందులను వాడాలి.
వానకాలంలో పంటలు వేసుకునే రైతులు వ్యవసా య శాఖ అధికారులతో వివరాలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకోవాలి. గ్రామాల్లో క్లస్టర్ ప్రాంతాల్లో రైతు వేదికలను ప్రభుత్వం నిర్మించింది. రైతు వేది కలకు వచ్చే అధికారులసూచనలు పాటించాలి.