
పాపన్నపేట, ఆగస్టు 8 : శక్తి స్వరూపిణీ వనదుర్గాదేవి క్షేత్రం దుర్గమ్మ నామస్మరణలతో మార్మోగింది. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వేదపండితులు అమ్మవారి మూలవిరాట్ విగ్రహానికి అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు మంజీర పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మరికొందరు అమ్మవారికి బోనాలు, ఓడి బియ్యం, తలనీలాలు సమర్పించారు. ఏడుపాయల దేవాదాయ ధర్మాదాయశాఖ కార్యనిర్వహణాధికారి సార శ్రీనివాస్ తమ సిబ్బందితో గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. వేదపండితులు శంకర్‌శర్మ, పార్థివశర్మ, మురళీశర్మ, రాముశర్మ, రాజశేఖర్‌శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సిబ్బం ది సూర్య శ్రీనివాస్, మధుసూదన్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాసశర్మ, మహేశ్, నరేశ్, యాదగిరి భక్తులకు సకల సౌకర్యాల కల్పించారు.
వనదుర్గాదేవి అమ్మవారిని మాజీ ఎమ్మెల్సీ, టీఎస్పీ ఎస్సీ సభ్యుడు సత్యనారాయణ దర్శించుకున్నా రు. ఆదివారం ఆయన తన మిత్రులతో కలిసి ఏడుపాయలకు చేరుకొని వనదుర్గాదేవిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. వీరికి ఆలయ సిబ్బంది మధుసూదన్‌రెడ్డిని సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఆయన వెంట మునిపల్లి సాయికుమార్, గణేశ్ తదితరులు ఉన్నారు.
మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 8 : భక్తులతో మెదక్ చర్చి కిటకిటలాడింది. ఆదివారం పెద్దఎత్తున భక్తు లు రావడంతో చర్చి ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఉద యం నుంచి మధ్యాహ్నం వరకు ప్రతి గంటకు జరిగే ప్రార్థనల్లో భక్తులు పాల్గొని ఏసయ్యకు మొక్కులు తీర్చుకున్నారు. ఏసయ్య నామస్మరణలతో చర్చి ప్రాంగణం హోరెత్తింది. చర్చి ప్రెసిబేటరీ ఇన్చార్జి రెవరెండ్ అండ్రూస్ ప్రేమ్‌సుకుమార్ భక్తులనుద్దేశించి దైవ సందేశం చేసి భక్తులను ఆశ్వీరదించారు. ప్రార్థనల్లో చర్చి పాస్టర్లు దయానంద్, రాజశేఖర్, జైపాల్, అనుగ్రహతో పాటు చర్చి కమిటీ సభ్యులు జయరాజ్, గెలెన్, రోలాండ్‌పాల్, శాంతికుమార్, సువన్డగ్లస్, ఉదయ్‌కిరణ్ పాల్గొన్నారు.