
మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 5: జిల్లా కేంద్రంలో కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యా యి. బృందావన్ కాలనీతో పాటు నల్లపోచమ్మ దేవాలయం , గంగినేని థియేటర్ వెనుక ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షం నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పట్టణ శివారులోని హల్దీవాగు, పసుపులేరు వాగు, ఎంఎన్ కెనాల్ నిండుగా ప్రవహిస్తున్నాయి.
పొంగి పొర్లుతున్న రాయిన్‌పల్లి ప్రాజెక్టు …
మెదక్ రూరల్, సెప్టెంబర్ 5: మెదక్ మండలంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బొల్లారం ,ర్యాలామడుగు చెక్‌డ్యామ్‌లు మతడి పోస్తున్నాయి. రాయిన్‌పల్లి ప్రాజెక్టు నిండి పొంగి పొర్లుతున్నది. చెరువులు ,వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.మండలంలోని చెరువులు జలకళను సంతరించుకున్నాయి. శనివారం రాత్రి నుంచి రా యిన్‌పల్లి ప్రాజెక్టు పొంగి తిమ్మనగర్, మక్తాభూపతిపూర్, వెంకటపూర్, కొంటూరు చెరువులకు నీళ్లు చేరుతున్నాయి.
ప్రత్యేక పూజలు ..
సర్పంచ్ సిద్ధ్దాగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షు డు ఆంజాగౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు , కిష్టయ్య నాయకుడు ఎలక్షన్‌రెడ్డి , గ్రామస్తులు గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు
పెద్దశంకరంపేటలో…
పెద్దశంకరంపేట,సెప్టెంబర్ 5: మండలంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన వర్షంతో మండలంలోని చెరువులు, కుం టలకు వర్షపు నీరు వచ్చి చేరింది. పట్టణంలోని చౌదరి చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతున్నది. తిర్మలాపురం చెరువు నిండి అలుగులు పారడానికి సిద్ధంగా ఉన్నది.