
హవేళీఘనపూర్, సెప్టెంబర్ 3 : స్వరాష్ట్రంలో పండుగులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని, సీఎం కేసీఆర్ బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన హవేళీఘనపూర్‌లో ఆయా గ్రామాలకు చెందిన మహిళలకు బతుకమ్మ చీరెలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్యరెడ్డి, మెదక్ పీఎసీఎస్ చైర్మన్ హన్మంత్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీరామ్, డిప్యూటీ తహల్దార్ నవీన్, ఐకేపీ ఏపీఎం భాస్కర్, టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మేకల సాయిలు, సర్పంచ్‌లు శ్రీహరి, యామిరెడ్డి, ఎంపీటీసీలు రాజయ్య, మంగ్యా, మెదక్ సొసైటీ డైరెక్టర్ సాయిలు, మెదక్ పట్టణ నాయకులు గంగాధర్, మండల టీఆర్ఎస్ నాయకులు బ్రహ్మం, గోపాల్‌గౌడ్, సాయాగౌడ్, శ్రీనివాస్, రాంచంద్రారెడ్డి, నరేందర్‌రెడ్డి, శ్రీను, కృష్ణమూర్తి, కుర్మ పోచయ్యతోపాటు మహిళలు తదితరులు పాల్గొన్నారు.