
మునిపల్లి/పుల్కల్ రూరల్, అక్టోబర్ 3 : సింగూరు ప్రాజెక్టు వద్ద ఇద్దరు అన్నదమ్ములు సరదాగా సెల్ఫీలు దిగు తూ ప్రమాదవశాత్తు ప్రా జెక్టులో పడిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. సిం గూరు ప్రాజెక్టు హెచ్ఎండబ్ల్యూస్ (గేట్ల ముం దు) దిగువ భాగానికి అన్నదమ్ములు తైయిఫ్ (20), సోహెల్ (27) సెల్ఫీ దిగుతున్న క్రమంలో తమ్ముడు తైయిఫ్ కాలు జారి పడిపోయాడు. తమ్ముడు తైయిఫ్ను కాపాడేందుకు నీటిలో దిగిన అన్న సోహెల్ మంజీరా నదిలో గల్లంతయ్యాడు. ఈక్రమంలో తమ్ముడు తైయిఫ్ గేట్లముందు భాగంలో ఉన్న సిమెంట్ గద్దెను పట్టుకుని అరుస్తుండడంతో పర్యాటకులు అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మునిపల్లి, పుల్కల్ పోలీసులు, రెస్క్యూ టీం తాడు సహాయంతో తైయిఫ్ను కాపాడారు. అన్న సోహెల్ కోసం రెస్క్యూ టీం, అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. వీరు హైదరాబాద్ ఇబ్రహీంబాద్కు చెందినవారుగా పోలీసులు తెలిపారు.