
ఆడబిడ్డలకు బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా ప్రారంభమైంది. శనివారం సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు బతుకమ్మ చీరెల పంపిణీని ప్రారంభించగా, మిగతా చోట్ల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభించి మహిళలకు అందించారు. కానుక అందుకున్న మహిళలు మురిసారు. బతుకమ్మ సారె అందించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ సంతోషంగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలని సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరెలు అందిస్తున్నారని, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని మంత్రి హరీశ్‌రావు అన్నారు.కాగా, 18 ఏండ్లు నిండిన అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరెలను అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మూడు నాలుగు రోజుల్లోనే మొత్తం చీరెలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 10,84,457 చీరెలు పంపిణీ చేయనున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తున్నారు. పండుగ వాతావరణంలో పంపిణీ ప్రక్రియ పూర్తిచేస్తున్నారు.
ఊరూవాడకు పండుగ శోభ వచ్చింది.. ప్రతి ఏడాది సీఎం కేసీఆర్ మహిళలకు బతుకమ్మ చీరెల పంపిణీ చేస్తుండగా, శనివారం ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని మహిళలకు చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామాయంపేటలో జరిగిన కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి స్థానిక మహిళలతో కలిసి ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ ఆడిపాడారు. చీరెల పంపిణీతో మహిళల కండ్లల్లో ఆనందం నెలకొన్నది. పండుగకు మా ఇంటి పెద్ద సారె పెట్టినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సారు మాకు చీరెలు పంపిణీ చేస్తున్నాడని సంతోషం వ్యక్తం చేశారు.
బతుకమ్మలు చీరెలు బాగున్నాయి..
బతుకమ్మల చీరెలు బాగున్నాయి. సీఎం కేసీఆర్ ప్రతి సంవత్సరం ఇస్తండు. ఈసారి రంగులు మంచిగున్నయి. మహిళలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. చీరలతో ఆడబిడ్డలు పండుగను సంబురంగా జరుపుకుంటరు.
అన్ని పండుగలకు ప్రాధాన్యం
సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ
చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లో బతుకమ్మ చీరెల పంపిణీ
చిన్నకోడూరు, అక్టోబర్ 2: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత అన్ని మతాలు, అన్నివర్గాలు జరుపుకొనే పండుగలకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ అన్నారు. మండల పరిధిలోని చంద్లాపూర్‌లో శనివారం ఆమె మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు.
అన్ని పండుగలకు ప్రాధాన్యం
చిన్నకోడూరు, అక్టోబర్ 2: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత అన్ని మతాలు, అన్నివర్గాలు జరుపుకొనే పండుగలకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ అన్నారు. మండల పరిధిలోని చంద్లాపూర్‌లో శనివారం ఆమె మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు.
భారతీనగర్ డివిజన్
జహీరాబాద్, అక్టోబర్ 2: ప్రతి ఒక్కరూ పండుగలను సంతోషంగా జరుపుకొనేందుకు సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరెలు పంపిణీ చేస్తున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు తెలిపారు. శనివారం జహీరాబాద్ పట్టణంలోని వాసవి కల్యాణ మండపంలో పేదలకు బతుకమ్మ చీరెలు పం పిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రధాన్యమిస్తూ పండగలకు కానుకలు పంపిణీ చేస్తుందన్నారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, జహీరాబాద్ ఆర్డీవో రమేశ్‌బాబు, డీఎస్పీ శంకర్రాజు, తహసీల్దార్ నాగేశ్వర్రావు, మున్సిపల్ కమిషనర్ సుభాశ్‌రావు, ఆత్మ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు ఎంజీ.రాములు, మోహినోద్దీన్, మాజీ ఏఎంసీ చైర్మన్ జి.గుండప్ప, కేతకీ దేవాలయం చైర్మన్ వెంకటేశం, రైల్వే బోర్డు సభ్యులు షేక్ ఫరీద్, టీఆర్ఎస్ నాయకులు ముత్యాల చంద్, ఇజ్రాయిల్ బాబీ, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
బతుకమ్మ చీరెల పంపిణీ అభినందనీయం
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు
దుబ్బాక, అక్టోబర్ 2: తెలంగాణలో మహిళలకు ఎంతో ఇష్టమైన బతుకమ్మ పండుగకు టీఆర్ఎస్ ప్రభుత్వం చీరెలు పంపిణీ చేయడం అభినందనీయమని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు కొనియాడారు. శనివారం దుబ్బాక పట్టణంలో నిర్వహించిన బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితాభూంరెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. కాగా, దుబ్బాక నియోజకవర్గంలో 57,919 చీరలు పంపిణీ చేశారు. దుబ్బాక మున్సిపాలిటీలో 7,360 మంది మహిళలకు, 30 గ్రామ పంచాయతీల్లో 13,537 చీరెలు పంపిణీ చేశారు. మిరుదొడ్డి మండలంలో 22 గ్రామాల్లో 12,252 మందికి చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సాయిలు, జడ్పీటీసీ లక్ష్మి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. దౌల్తాబాద్, రాయపోల్ మండల కేంద్రాల్లో బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్ పాల్గొన్నారు. దౌల్తాబాద్ మండలంలో 24 గ్రామాల్లో 9,065 చీరెలు, రాయపోల్ మండలంలో 19 గ్రామాల్లో 8,145 మంది మహిళలకు చీరెలు పంపిణీ చేశారు. తొగుట మండలంలో 16 గ్రామాల్లో 7560 చీరెలు పంపిణీ చేశారు.