
కొండపాక, ఆగస్టు 31 : పోలీసుస్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ వారి సమస్యలను పరిష్కరించాలని గజ్వేల్ ఏసీపీ రమేశ్ సూచించారు. మంగళవారం కుకునూరుపల్లి పోలీసుస్టేషన్‌ను ఏసీపీ సందర్శించారు. ఫిర్యాదుదారులతో ఎలా మాట్లాడుతున్నారు.. దరఖాస్తులు ఏం వస్తున్నాయనే అంశాలను ఆరా తీశారు. ప్రతి ఒక్క దరఖాస్తుకు రిసిప్ట్ ఇవ్వాలన్నారు. పోలీసుస్టేషన్లో నమోదైన కేసుల గురించి ఎస్సైని అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిసరాల్లో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చూడాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు సేవలందించాలన్నారు. డయల్ యువర్ 100కు కాల్ రాగానే తక్షణమే స్పందించి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించాలన్నారు. అన్నోన్ ప్రాపర్టీ వాహనాలను 102 సీఆర్పీసీలో కేసు నమోదు చేసి యజమాని గురించి అన్నికోణాల్లో దర్యాప్తు చేయాలన్నారు. దొరకని పక్షంలో జిల్లా సీఏఆర్ హెడ్ క్వార్టర్‌కు వాహనాలు పంపించాలన్నారు. అధికారులు, సిబ్బంది మానవీయకోణంలో విధులు నిర్వర్తించి డిపార్ట్మెంట్కు మంచి పేరు తీసుకరావాలన్నారు.