
నర్సాపూర్, ఆగస్టు 15 : నర్సాపూర్ మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో 75 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ మురళీయాదవ్, ఆర్డీవో కార్యాలయంలో డీఏవో తబితరాణి, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ జ్యోతి సురేశ్ నాయక్, పోలీస్‌స్టేషన్‌లో సీఐ లింగేశ్వరరావు, ఎస్సై గంగరాజు జాతీయ జెండాను ఎగురవేశారు.
మెదక్ మున్సిపాలిటీ, ఆగష్టు 15 : పంద్రాగష్టు పురస్కరించుకుని ఆదివారం జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలత శేఖర్‌గౌడ్, ఎమెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చైర్మన్ దొంతి చంద్రగౌడ్, జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో డీటీవో శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ చంద్రపాల్ జాతీపతకాన్ని ఆవిష్కరించారు. ఎంఈవో కార్యాలయంలో ఎంఈవో నీలకంఠం జాతీయ పతాకాన్ని అవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, జడ్పీ సీఈవో శైలేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జగపతి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అశోక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్‌రావు కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, శ్రీనివాస్, జయరాజ్, లక్ష్మీనారాయణ గౌడ్, కిశోర్, విశ్వం, మహిళా కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గంగాధర్, నాయకులు కృష్ణాగౌడ్, లింగారెడ్డి, శేఖర్‌గౌడ్, దుర్గాప్రసాద్, ఉమర్, సాధిక్, పాపయ్య, ప్రవీణ్‌గౌడ్, శివరామ కృష్ణ, కొండ శ్రీనివాస్, పురం వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.