e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 8, 2021
Home జిల్లాలు టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధ్ది సాధ్యం

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధ్ది సాధ్యం

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధ్ది సాధ్యం

పేదల అభ్యున్నతికి అహర్నిశలు కృషి
ప్రభుత్వ పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి
బస్తీబాటలో జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

జడ్చర్ల, ఏప్రిల్‌ 12 : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి చెందుతున్నదని జడ్చర్ల ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి అన్నారు. బస్తీబాట కార్యక్రమం లో భాగంగా సోమవారం జడ్చర్ల మున్సిపాలిటీలోని రాఘవేంద్రస్వామి ఆలయ ప్రాంతం, గౌరీశంకర్‌ కాలనీల్లో ఎమ్మె ల్యే పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో సీసీరోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని మున్సిపల్‌ కమిషనర్‌ సునీత, ఏఈ సాయికిరణ్‌కు సూచించారు. అదేవిధంగా ఇండ్లకు ఆనుకొని ఉన్న విద్యుత్‌ స్తం భాలను తొలగించి కొత్త లైన్‌ ఏర్పాటు చేయాలని తెలిపారు. రాష్ర్టాభివృద్ధితోపాటు పేదల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అ హర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుతున్నదని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే మన రాష్ట్రం నెంబర్‌వన్‌ స్థానంలో ఉందన్నారు. త్వరలోనే పేదలందరికీ డబుల్‌బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని, ఇందు కు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. అనంతరం గౌరీశంకర్‌కాలనీలో కల్కీ భగవాన్‌ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో సంగీత, నాటక అకాడమీ చైర్మన్‌ బాద్మి శివకుమార్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాట్రపల్లి లక్ష్మ య్య, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్‌ జంగయ్య, మురళి, రేణుక, సీతా రాం, రవిశంకర్‌, పాం డయ్య, కోట్ల ప్రశాంత్‌రెడ్డి, జీనురాల సత్యం, దోరెపల్లి ర వీందర్‌, అశోక్‌రెడ్డి, బీకేఆర్‌, పర్వత్‌రెడ్డి, మచ్చలశ్రీను, విజయలక్ష్మి, అయ్యన్న, ప్రీతం, లత, చైతన్య, రమేశ్‌, పెద్ది వెంకటేశ్‌, దామోదర్‌, సతీశ్‌, వెంకటేశ్‌గౌడ్‌, కల్కీభగవాన్‌ సేవాసమితి సభ్యులు చంద్రశేఖర్‌రెడ్డి, రంగ రాములు, భాస్కర్‌రెడ్డి, అరుణమ్మ, రాధ, లలిత, పార్వతి, విజయ, భార్గవి, కృష్ణవేణి, భాను పాల్గొన్నారు.


మంత్రి కేటీఆర్‌ పర్యటనను జయప్రదం చేయాలి
మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పర్యటనను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కోరా రు. 14న జడ్చర్లలో మంత్రి పర్యటన సందర్భంగా సోమవారం స్థానిక చంద్రాగార్డెన్స్‌లో పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే సమావేశమై మాట్లాడారు. మంత్రి పర్యటన సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డు లో నిర్వహించే మంత్రి సభకు పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజలను సభకు తీసుకురావాలని తెలిపారు. అయితే, కరోనా నేపథ్యంలో ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటించడంతోపాటు మాస్కులను ధరించేలా చూడాలన్నారు. మంత్రి కేటీఆర్‌ ముందుగా కావేరమ్మపేటలో బీటీరోడ్డు, మిషన్‌ భగీరథ వాటర్‌ట్యాంక్‌ ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం డబుల్‌బెడ్రూం ఇండ్ల పనులను పరిశీలిస్తారన్నారు. అలాగే కావేరమ్మపేటలో మినీ ట్యాంక్‌బండ్‌ పనులను ప్రారంభిస్తారని తెలిపారు. హౌసింగ్‌బోర్డు కాలనీలో రూ.15కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సూచించారు.

Advertisement
టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధ్ది సాధ్యం
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement