e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home జిల్లాలు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

దేవరకద్ర బస్టాండ్‌ స్థలంలో పెట్రోల్‌బంక్‌ ఏర్పాటుకు అనుమతి
ఉగాది వరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సిద్ధం కావాలి
దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

దేవరకద్ర రూరల్‌, ఏప్రిల్‌ 3 : దేవరకద్ర పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం మండలకేంద్రంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. వర్షాకాలంలో ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణ బురదమ యం అవుతుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సీసీ నిర్మాణం చేపట్టాలని ఆర్టీసీ ఆర్‌ఎం ఉషాదేవి, డీఎం అశోక్‌రాజుకు సూచించారు. బస్టాండ్‌ ముందుభాగంలో పెట్రోల్‌బంక్‌ ఏర్పాటుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. అలాగే ఖాళీ స్థలంలో మినీ థియేటర్‌ లేదా మినీ ఫంక్షన్‌హాల్‌ ఏర్పాటుకు అవకాశం ఉన్నందున పనులు చేపట్టాలని కోరారు. బస్టాండ్‌ ఆవరణలో సులభ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణంతోపాటు మొక్కలు పెంచాలన్నారు. అనంతరం ఆర్‌వోబీ పనులతోపాటు, వీరప్పయ్యస్వామి ఆలయ స్థలం లో నిర్మిస్తున్న దుకాణ సముదాయాన్ని పరిశీలించారు. అలా గే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవన నిర్మాణ పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఉగాది వరకు పనులు పూర్తి చేసి ప్రా రంభానికి సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌ బీ డీఈ సంధ్య, ఏఈ కౌశిక్‌, ఎంపీడీవో శ్రీనివాసులు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొండారెడ్డి, పీఏసీసీఎస్‌ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, డైరెక్టర్‌ కృష్ణగోపాల్‌, మాజీ ఎంపీపీ ఈవీ గోపాల్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, శ్రీకాంత్‌యాదవ్‌, కొండా శ్రీనివాస్‌రెడ్డి, శ్రీకాంత్‌, శేఖర్‌రెడ్డి, రామకృష్ణ, ఆంజనేయులు, వెంకటేశ్‌, బాలస్వామి, వెంకట్రాములు, యుగంధర్‌రెడ్డి, చల్మారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

ట్రెండింగ్‌

Advertisement