Hyderabad | ‘మిస్టర్ తెలంగాణ’ విజేత మారుతీ చరణ్

బన్సీలాల్‌పేట్: ఇటీవల ఆగ్రాలో జరిగిన ‘మిస్టర్ అండ్ మిసెస్ ఇండియా’ పోటీలలో సికింద్రాబాద్‌కు చెందిన రేణికుంట మారుతీచరణ్ తన సత్తా చాటాడు. మారుతీచరణ్ సికింద్రాబాద్ పద్మారావునగర్‌లోని సర్దార్ పటేల్ కళాశాలలో బీఏ రెండవ సంవత్సరం చదువుతున్నాడు.‘మిస్టర్ అండ్ మిసెస్ ఇండియా’ పోటీలలో శారీరక ధారుఢ్యత కనబరచి ‘మిస్టర్ తెలంగాణ’ టైటిల్ గెలుచుకున్నాడు. మారుతీచరణ్ చదువుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ , బాడీబిల్డింగ్, మోడలింగ్ రంగాలలో కూడా రాణిస్తున్నాడు.
కాగా మారుతీచరణ్ రాబోయే కాలంలో మరిన్ని పతకాలను సాధించి, దేశానికి, రాష్ట్రానికి, కళాశాలకు మంచి ఖ్యాతి తీసుకురావాలని కళాశాల పాలకమండలి ప్రధాన కార్యదర్శి బి.సురేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ కే.నర్మద, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.అమరనాథ శర్మలు మారుతీచరణ్ను శాలువాతో సన్మానించి, అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా మారుతీ చరణ్ మాట్లాడుతూ తాను ర్యాంప్‌వాక్ ప్రాక్టిస్ చేస్తున్నానని, మిస్టర్ ఇండియా పోటీలలో ఇంటర్యూలకు సిద్ధం అవుతున్నానని తెలిపారు. నగరంలో జరిగిన మిస్టర్ అండ్ మిసెస్ పోటీలలో ఫైనలిస్ట్‌గా నిలిచానని, మిస్టర్ ఫోటోజెనిక్ హైద్రాబాద్ పోటీలలో విజేతగా నిలిచానని అన్నారు. మిస్టర్ ఏసియా, మిస్టర్ బాలీవుడ్ పోటీలలో సెమీ ఫైనల్స్ అర్హత సాధించానని తెలిపారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

