
మక్తల్‌రూరల్, ఆగస్టు 12: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తున్నదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో గురువారం భూత్పూర్ మత్స్యసహకార సంఘం ఆధ్వర్యంలో 8లక్షల చేపపిల్లలను ఎమ్మెల్యే చిట్టెం చేతులమీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో మత్స్యకార్మికుల అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. గత ప్రభుత్వాలు మత్స్యకారులను పట్టించుకోలేదని, సరైన ప్రోత్సాహం లేక వెనుకబడ్డారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించిందన్నారు. మక్తల్ నియోజకవర్గంలో రాజీవ్‌భీమా ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన సంగంబండ (చిట్టెం నర్సిరెడ్డి), భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల మత్స్యసంపద గణనీయంగా పెరిగిందన్నారు. గతేడాది ఈ రెండు రిజర్వాయర్లలో 20లక్షల చేపపిల్లలను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి వెల్లడించారు. దీంతో మక్తల్ ప్రాంతంలో వేలాదిమంది మత్స్యకార్మికులకు ఉపాధి లభించిందన్నారు. మత్స్యకారులు దళారులను నమ్మి మోసపోవద్దని, సొంతంగా వ్యాపారం చేసుకుంటే మంచి లాభాలు వస్తాయన్నారు. మత్స్యకారులకు స్థానికంగా చేపల మార్కెట్ ఏర్పాటు చేయడానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే చిట్టెం హామీ ఇచ్చారు. భూత్పూర్ రిజర్వాయర్‌లో చేపపిల్లలను పెంచుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడంపై సొసైటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో భూత్పూర్ సొసైటీ అధ్యక్షుడు శేఖర్, సెక్రటరీ ఆంజనేయులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని కర్ని గ్రామానికి చెందిన భగవంత్‌కు సీఎం రిలీఫ్‌ఫండ్ కింద మంజూరైన రూ.60వేల చెక్కును గురువారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో కర్ని మాజీ సర్పంచ్ రాఘవేందర్‌గౌడ్, నియోజకవర్గ అధికార ప్రతినిధి రాంలింగం, మీడియా కన్వీనర్ నేతాజీరెడ్డి, నాయకులు శేఖర్‌రెడ్డి, ఈశ్వర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.