మహబూబ్‌నగర్ టౌన్, ఆగస్టు12: వక్ఫ్ భూములు అన్యాక్రంతం కాకుండా పరిరక్షిస్తామని ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కమిటీ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని వక్ఫ్ భూములను పరిరక్షించేందుకు కమిటీ చర్యలు తీసుకోవాలన్నారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నాలుగు చోట్ల సుమారు 20ఎకరాల్లో ఖబరస్తాన్లకు భూములు ఇచ్చామని, మసీదుల పునరుద్ధరణకు నిధులు, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. అబ్దుల్ ఖాదర్ దర్గాను ఆధునీకరించామన్నారు. కలెక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటుచేసిందని, కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్, ఆర్డీవోతో పాటు మైనార్టీ నుంచిఒకరు అధ్యక్షుడిగా, ఇద్దరు అడ్వకేట్లతో పాటు ఒకరు సీనియర్ సిటిజన్ సభ్యులుగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వక్ఫ్ పరిరక్షణ కమిటీ చైర్మన్ అన్వర్‌పాషా, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ ఇసాక్, డీసీసీబీ అధ్యక్షుడు నిజాంపాషా, కౌన్సిలర్లు షబ్బీర్ అహ్మద్, షేక్ఉమర్, నాయకులు ఇఫ్తెకార్ అహ్మద్, మోసిన్ ఖాన్, అబ్దుల్ హాదీ, జకీ, రఫీక్పటేల్, అంజద్, కమిటీ సభ్యులు జావిద్ అలీ, రహీమునీస్సా బేగం పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ న్యూటౌన్‌లోని మున్సిపల్ కాంప్లెక్స్‌లో నూతనంగా ఏర్పాటుచేసిన షాలీమార్ ఐస్‌క్రీం పార్లర్ బేకర్స్‌ను గురువారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు.నిర్వాహకులు సయ్యద్ జమీల్ మాట్లాడుతూ కోల్డ్ స్టోన్, చార్ట్, థిక్‌షేక్, లస్సీ, డ్రైఫ్రూట్స్, చాక్లెట్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు.
మహబూబ్‌నగర్, ఆగస్టు12: సాధారణ యూరియాతో ఎంత మేలు జరుగుతుందో ద్రవరూప యూరియా పంటలపై పిచికారీ చేయడం ద్వారా అంతే మేలు జరుగుతుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని వక్ఫ్ కాంప్లెక్స్ సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ద్రవరూప యూరియాను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ ధృవీకరించిన మీదట ఇది విడుదల చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొదటి సారిగా ఇఫ్కో కంపెనీ ద్రవరూప యూరియాను వాడుకలోకి తీసుకొచ్చిందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి సుచరిత, ఇఫ్కో కంపెనీ జిల్లా ప్రతినిధి బాలాజీ, వ్యవసాయ అధికారి కొమురయ్య పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎర్రసత్యం చౌరస్తా వద్ద దివంగత నేత ఎర్రసత్యం విగ్రహానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఎర్రసత్యం ఎంతో మందికి మేలు చేశారని కొనియాడారు.