e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, April 18, 2021
Advertisement
Home జిల్లాలు జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలి

జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలి

జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలి

గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి
వలసల నివారణకు కృషి చేయాలి
జెడ్పీ చైర్‌పర్సన్‌ వనజాగౌడ్

నారాయణపేట టౌన్‌, ఏప్రిల్‌ 8 : జిల్లాలో చేపడుతున్న పనులను వేగవంతం చేస్తూ అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు అధికారులందరూ కృషి చేయాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ వనజాగౌడ్‌ అన్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో వనజాగౌడ్‌ అధ్యక్షతన రెండో స్థాయీ సంఘం (గ్రామీణ అభివృద్ధి), వైస్‌ చైర్మన్‌ సురేఖారెడ్డి అధ్యక్షతన మూడో స్థాయీ సంఘం (వ్యవసాయం) సమావేశాలు ని ర్వహించారు. ఆయా సమావేశాల్లో వివిధ శాఖల అధికారు లు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. ఈ సందర్భం గా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ గ్రామాల్లో చేపడుతున్న పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్‌ షెడ్డులు, రై తు కల్లాలను వెంటనే పూర్తి చేయాలన్నారు. గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలన్నారు. జిల్లాలోనే ఉపాధి అవకాశాలు కల్పించడంతో వలసల నివారణకు కృషి చేయాలన్నారు.


2020-21 వానకాలం సీజన్‌లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో 19 కొనుగోలు కేంద్రాల్లో 2,73,746 క్విం టాళ్ల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు డీఆర్డీఏ అధికారి వెల్లడించారు. గొర్రెలు, మేకలు పెంచుతున్న సభ్యురాళ్లతో 15 నుంచి 20 మంది చొప్పున లైవ్‌స్టాక్‌ ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ గ్రూప్‌లను ఏర్పాటు చేశామన్నారు. నా బార్డ్‌ వారి సహకారంతో రూ.5లక్షలతో పేట మండల మహిళా సమాఖ్యచే రూరల్‌ మార్ట్‌ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా లో 46,128 ఇంకుడుగుంతల నిర్మాణాలకు ఆమోదం తెలుపగా 20,513 పూర్తయ్యాయన్నారు. ఉద్యానవన పథకం ద్వారా 20 20-21కి గానూ 134 మంది రైతులు రూ. 253.12 ఎకరాల్లో పండ్ల తోటలను సాగు చేస్తున్నారన్నారు. జిల్లాలో రూ.578 కోట్ల అంచనాతో మిషన్‌ భగీరథ పనులను చేపడుతున్నట్లు మిషన్‌ భగీరథ శాఖ అధికారి తె లిపారు. జిల్లాలో మొత్తం 417 గ్రామాలకు ఈ పథకం ద్వారా నీటిని అందిస్తున్నామన్నారు. పౌర సరఫరాల శాఖ ద్వారా 2020-21 సీజన్‌లో 57 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 14,034 మంది రైతుల ద్వారా 73,553 టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఆ శాఖ అ ధికారి తెలిపారు. మద్దూర్‌ మండలంలో చనిపోయిన వారి పేర్లపై రేషన్‌ బియ్యం తీసుకుంటున్నారని జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి తెలుపగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి వారి పేర్లను తొ లగించేలా చర్యలు తీసుకుంటామని అధికారి చెప్పారు.

అక్రమంగా రేషన్‌ బియ్యం రవాణా అవుతున్న సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని జెడ్పీటీసీ ఆరోపించారు. సన్నబియ్యంలో 30శాతం మేర నూకలు వస్తున్నాయని కోఆప్షన్‌ సభ్యుడు తాజొద్దీన్‌ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. రైతుబంధు పథకం ద్వారా జిల్లాలో 20 20-21 యాసంగిలో 14,7865 మంది రైతులకు 221. 31 కోట్ల నగదును రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వ్యవసాయశాఖ అధికారి తెలిపారు. పంట రుణ మాఫీలో భా గంగా మొదటి విడుతలో 5403 మంది రైతులకు రూ.8.7 2 కోట్లను మాఫీ చేసినట్లు చెప్పారు. పీఎం కిసాన్‌ ద్వారా జిల్లాలోని 11,0386 మంది రైతులకు 66.23 కోట్లను రై తు ఖాతాలో జమ చేశామన్నారు. 2020-21లో జిల్లాలో 16.55 లక్షల రొయ్యలను పంపిణీ చేసినట్లు మత్స్యశాఖ అధికారి తెలిపారు. సమావేశంలో జిల్లా పరిషత్‌ సీఈవో సిద్ధి రామప్ప, కో ఆప్షన్‌ సభ్యుడు తాజొద్దీన్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలి

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement