కోయిలకొండ, ఏప్రిల్ 13 : కొలిచేవారికి కొంగు బంగారంగా పేరుగాంచిన కోయిలకొండ వీరభద్రస్వామి ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. చైత్రశుద్ధ త్రయోదళి 14నుంచి 18 (బహుళ విదియ) వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తమ్మళి విజయ్, రాము, భరత్‌లు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం కోయిలకొండ నుం చి దేవాలయం వరకు స్వామివారి పల్లకీ సేవ,15న శుక్రవారం ప్రభోత్పవం,16 శనివారం రథోత్సవం,17 ఆదివారం అగ్నిగుండం,18న సోమవారం భద్రకాళి వీరభద్రస్వామి కల్యాణం నిర్వహిస్తారు. అలా గే ప్రతిరోజూ స్వామివారికి నందికోల సేవ, అఖండభజన తదితర కార్యక్రమాలు చేపడుతారు. ఈ సందర్భంగా భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కోయిలకొండ సమీపంలోని ఆచార్యపూర్ గుట్టపై స్వయంభూగా ఉగ్రరూపంలో వీరభ్రదస్వామి వెలిశారు. కాకతీయుల కాలం లో రాజులు యుద్ధానికి వెళ్లే ముందు యు ద్ధంలో ధైర్యసాహసాలు చూపాలని, యు ద్ధంలో విజయం సాధించాలని కోయిలకొండ వీరభ్రదస్వామిని దర్శించుకొని వెళ్లేవారని ఆలయ చరిత్ర చెబుతున్నది. ఆనా టి నుంచి నేటి వరకు భక్త్తుల ఇలవేల్పుగా వీరభద్రస్వామి పూజలందుకుంటున్నాడు.
తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనం కోసం తరలివస్తారు. ఇక్కడి వచ్చే భక్తులు స్వామికి భక్షాలతో నైవేద్యం పెడితే కొరిన కోర్కెలు తీరుతాయని భక్తులు నమ్మకం. దీంతో ప్రతి ఒక్కరూ స్వామివారికి నేవేద్యంగా భక్షాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా వీరభద్రస్వామి ఆలయం ప్రకృ తి రమణీయంగా కొండప్రాంతంలో ఆహ్లాదకర వాతావరణంలో ఉంది. దేవాలయం వద్ద భక్తుల కోసం కాటేజీలు, విశ్రాంతి భవనాలు, భక్తులు సేదతీరేందుకు పార్కులు, కోనేరు ఉన్నాయి.