
వందశాతం పనులు పూర్తి
ఉత్తమ పంచాయతీ అవార్డు అందుకున్న సర్పంచ్
బాలానగర్, ఆగస్టు 29 : గ్రామాల్లో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తున్నది. జూలై 1 నుంచి 10వ తేదీ వరకు కార్యక్రమం నిర్వహించారు. పారిశుధ్యం, పాత గోడలు, ఇండ్ల తొలగింపు, రహదారుల నిర్మాణం, శుభ్రం చేయడం, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, వీధి దీపాల కోసం ప్రత్యేక తీగలు బిగించడం తదితర పనులు చేపట్టారు. జరిగిన పనులకు అధికారులు మార్కులు వేసి ఉత్తమ పంచాయతీగా ఎంపిక చేశారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున వందశాతం పనులు పూర్తి చేసిన గ్రామాన్ని ఎంపిక చేశారు.
జిల్లాలో మూడు జీపీలు ఎంపిక
మహబూబ్‌నగర్ మండలంలోని కోడూర్, దేవరకద్ర లో గుడిబండ, బాలానగర్ మండలంలో పెద్దాయపల్లి ఉత్త మ గ్రామ పంచాయతీలుగా ఎంపికయ్యాయి. ఆగస్టు 15న జిల్లా కేంద్రంలో పరేడ్ గ్రౌండ్లో జరిగిన 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, కలెక్టర్ వెంకట్రావు నుంచి ఆయా గ్రా మ పంచాయతీల సర్పంచులకు, కార్యదర్శులకు అవార్డులు అందజేశారు.
ఉత్తమ పంచాయతీగా
మండలంలోని పెద్దాయపల్లి గ్రామ పంచాయతీలో పారిశుధ్యంతోపాటు పల్లె ప్రకృతి వనం నిర్వహణ, డంపింగ్ యార్డు, వైకుంఠధామం, నర్సరీ నిర్వహణ, ఎవెన్యూ ప్లాంటేషన్, రైతు వేదికల్లో 100 శాతం పనులను సర్పంచ్, కార్యదర్శి పూర్తి చేశారు. ప్రజల సహకారంతో వందశాతం పన్ను వసూలు, ప్రతి ఇంటి అవరణలో మరుగుదొడ్డి, పరిశుభ్రత చర్యలు పకడ్బందీగా చేపట్టారు. పథకాలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని గ్రామాన్ని మరింత అభివృద్ధి పరిచేందకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నామని సర్పంచ్ శంకర్ తెలిపారు. గ్రామస్తుల సహాయంతో 14 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గ్రామంలో వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల రాకుండా ప్రతి వీధిలో పారిశుధ్య కార్మికులచే బ్లీచింగ్ పౌడర్ చల్లించడం, రోడ్లను ఊడ్చడం, తడి, పొడి చెత్తను వేరు చేయడం జరిగింది.
హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు ప్రతిరో జు నీళ్లుపోయడం చే పట్టారు. ఎమ్మెల్యే స హకారంతో గ్రా మాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నారు. పల్లె ప్రగ తి కార్యక్రమంలో గ్రామ రూపురేఖ లు మారిపోయాయి.
గ్రామంలో ఎంతో అభివృద్ధి
పల్లె ప్రగతి కార్యక్రమం తో గ్రామంలో చాలా అభివృ ద్ధి జరిగింది. అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయి. మౌలిక వసతులు సమకూరాయి. వై కుంఠధామం, డంపింగ్ యా ర్డు, గ్రామస్తులకు అనువైన స్థలంలో పార్కును ఏర్పా టు చేయడం. మొక్కలు నాటడం, వీధులు శుభ్రంగా ఉంచడంతో ప్రజలకు చాలా మేలు జరుగుతున్నది. మా గ్రామ పంచాయతీ ఉత్తమ పంచాయతీగా ఎంపిక కావడం చాలా సంతోషం.
పల్లె ప్రగతితోనే మార్పు
పల్లె ప్రగతితో మా గ్రా మ పంచాయతీ రూపురేఖ లు పూర్తిగా మారిపోయాయి. ప్రభుత్వ పథకాలను సకాలం లో లబ్ధిదారులకు అందిస్తు న్నాం. ఎప్పటికప్పుడు డ్రైనేజీల ను శుభ్రం చేస్తూ గ్రామాన్ని శుభ్రంగా ఉంచుతున్నాం. హరితహారంలో నాటిన మొక్కలకు ప్రతిరోజు నీళ్లు పడుతున్నాం. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నాం.
బాధ్యత పెరిగింది
ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక కావడం సంతోషంగా ఉంది. అధికారు లు, ప్రజల సహకారంతో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో ఈ అవార్డు దక్కింది. అవార్డుతో మాపై బాధ్యత మరింత పెరిగింది. అధికారులు, గ్రామస్తుల సహకారంతో వందశాతం ప నులు పూర్తి చేసి అవార్డు అందుకున్నాం. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అవార్డు అందుకోవడం సం తోషంగా ఉంది. ఇదే స్ఫూర్తితో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం.