
ఎంపికైన ప్రాజెక్టులకు రూ.10వేలు అకౌంట్లో జమ
సెప్టెంబర్ 1 నుంచి జిల్లాస్థాయి ఇన్స్పైర్ నిర్వహణ
మహబూబ్‌నగర్ టౌన్, ఆగస్టు 22 : ప్రకృతి శోధించి …మేధస్సును మదించి.. నిరంతర పరిశోధనలతో బాల శాస్త్రవేత్తలు రూపొందించిచే ప్రదర్శనలకు ఈసారి ఆన్లైన్ వే దిక కానున్నది. బాల్యం నుంచే విద్యార్థుల్లో శాస్త్రీయ భావన లు పెంపొందించి.. శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇన్స్పైర్ ప్రదర్శన ప్రవేశపెట్టారు. అయితే కొవిడ్-19 నేపథ్యంలో ప్ర దర్శనలా కాకుండా వీడియో రూపంలో అందజేయాలని ప్ర ధానోపాధ్యాయులకు సూచించారు. సెప్టెంబర్ 1 నుంచి 20 వ తేదీ లోపు ఇన్స్పైర్ మానక్యాప్లో అప్లోడ్ చేయాల ని విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. 2020-21ఇన్స్పైర్ అవార్డు మేళాకు 62 ప్రాజెక్టుల ను ఎంపిక చేశారు.
ఎంపికైన ప్రాజెక్టులకు రూ.10వేలు మంజూరు చేశారు. ఇప్పటికే రూ.10 వేలను విద్యార్థుల అకౌంట్లో వేశారు. అ కౌంట్ కరెక్ట్‌గా ఉండి జమా కానీ విద్యార్థులు తమ వివరాలను కవరింగ్ లెటర్‌తో డీఈవో కార్యాలయంలో అందజేయాలని, ఈ నిధులకు అనుగుణంగా ప్రాజెక్టులు రూపొంది ంచాలి. పరిశోధనల వేదిక ఆన్లైన్ విధానంలో జరుగనుండంతో..అందుకు అనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చే యాలి. ఇన్నోవేషన్ కలిగిన అంశాన్ని తయారు చేయించడం తో పాటు విద్యార్థికి అందుకు అనుగుణంగా ఉన్న అంశాలపై ఆలోచన కల్పించాలి.
ప్రాజెక్టులు అందించాలి
జిల్లాస్థాయి మేళాకు ఎంపికైన ఇన్స్పైర్ అవార్డ్స్ ప్రాజెక్టుల వివరాలను విద్యార్థి, గైడ్ టీచర్స్ 30 ఎంబీకి మించకుండా ఉండాలి. ఫొటోలు 3 నుంచి 4 వరకు ఆడియో 2 నిమిషాల కంటే తక్కువగా ఉంటేట్లు తయారు చేసుకోవాల ని మార్గదర్శకాల్లో సూచించా రు. జిల్లాస్థాయి ప్రదర్శనలో పా ల్గొనే విద్యార్థులు సెప్టెంబర్ 1 నుంచి 20వ తేదీ లోగా యాప్ లో వివరాలు అప్లోడ్ చేయా లి. అందులో ఉత్తమమైన వాటి ని ఎంపిక చేసి రాష్ట్రస్థాయికి పం పించనున్నారు. ప్రాజెక్టులోని అంశాలను వివరిస్తూ విద్యార్థులు అందజేసే వీడియో ఆధారంగానే విజేతలను ఎంపిక చేయనున్నారు.
దరఖాస్తుల ఆహ్వానం..
2021-22 విద్యా సంవత్సరానికి ఇన్స్పైర్ మానక్ అవార్డు కోసం జిల్లాలోని అన్ని యాజమాన్యల పరిధి పా ఠశాలల విద్యార్థుల పేర్లు నమోదు చేసుకోవాలి. ఉన్నత పాఠశాలలు 6 నుంచి 10వ తరగతి వరకు 5 ప్రదర్శనలు అప్‌లో డ్ చేయాలి. విద్యార్థి జాతీయ బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఖాతాలు లేని విద్యార్థులకు ఖాతాలు తెరిచేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి. అక్టోబర్ 15వ తేదీ వరకు ఇన్స్పైర్ మానక్ వెబ్సైట్లో పాఠశాల ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి నమోదు చేయాలి. ఇతర వివరాలకు జిల్లా సైన్స్ అధికారి 988595142 5 నంబర్‌ను సంప్రదించాలి.