
భగీరథ నీళ్లు ప్రతి గ్రామానికి చేరాలి
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
కృష్ణ, ఆగస్టు21: హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్క నూ సంరక్షించాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం కృష్ణ మండల కేంద్రంలో ఎంపీపీ పూర్ణిమాపాటిల్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించగా, ఎమ్మెల్యే చిట్టెం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి గ్రామానికీ తాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రకృతి వనాల్లో మొక్కలు విరివిగా పెంచాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామపంచాయతీలకు విద్యుత్ మీటర్లు తప్పనిసరిగా బిగించాలన్నారు. అనంతరం వ్యవసాయశాఖ, విద్యాశాఖ, పంచాయతీరాజ్, మిషన్‌భగీరథ, శిశు సంక్షేమశాఖ అధికారులు ప్రగతిని వివరించారు. అనంతరం హిందూపూర్ గ్రామంలో పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించి లోపాలను సరిచేయాల్సిందిగా కార్యదర్శిని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అంజనమ్మపాటిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్‌గౌడ్, సింగిల్‌విండో అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరిస్తాం
మక్తల్ టౌన్, ఆగస్టు21: మున్సిపాలిటీ ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం మక్తల్ మున్సిపాలిటీలోని 8వ వార్డులో శబరి కాలనీలో రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందులను గుర్తించి ఎమ్మెల్యే నిధులతో సీసీరోడ్డు నిర్మాణం చేపట్టేందుకు అధికారులను ఆదేశించారు. అధికారులు క్రిష్ణవేణి స్కూల్ నుంచి 300మీటర్ల పొడవు 15మీ.వెడల్పుతో కొలతలు తీసుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మక్తల్ మున్సిపాలిటీలో నిధుల కొరతతో 8వ వార్డులో రూ.30లక్షల ఎమ్మెల్యే నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. మున్సిపాలిటీ అధికారులు, పాలకవర్గం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఇప్పటికే రూ.కోటీ10లక్షలతో మున్సిపాలిటీలో సీసీ రోడ్డు పనులు చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో ఏఈ నాగశివ, సత్యారెడ్డి, కావలి ఆంజనేయులు, నర్సింహారెడ్డి, కమ్మరి రవికుమార్, పవన్ గౌడ్, సిద్ధిరాములు పాల్గొన్నారు.