
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 20 (నమస్తే తె లంగాణ ప్రతినిధి) : టీటీడీ పాలక మండలి సభ్యుడిగా మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండ లం గుర్కుంటకు చెందిన యువ పారిశ్రామికవేత్త మన్నె జీవన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం శ్రీవారి ఆలయంలో గరుడాళ్వార్ సన్నిధిలో జీవన్‌రెడ్డితో టీటీడీ అదనపు ఈవో ఏవీ ధ ర్మారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ టీటీడీ ధర్మకర్తల పాలక మండలిలో చోటు కల్పించిన తెలంగాణ సీ ఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కలియుగ వైకుంఠమైన శ్రీ తిరుమల వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ఒక భక్తుడిగా సేవ చేసే అదృష్టం కలిగినందుకు చాలా సం తోషంగా ఉందన్నారు. ఇది తన పూర్వజన్మ సుకృ తంగానే భావిస్తున్నానని తెలిపారు.