
పైసల కలెక్షన్ విషయమై ఓ కుటుంబం నిర్బంధం
గదిలో బంధించి చిత్రహింసలు
పోలీసుల సాయంతో బయటపడ్డ బాధితులు
హైదరాబాద్ దవాఖానకు తరలింపు
సంపట్రావుపల్లిలో ఘటన
వీపనగండ్ల, ఆగస్టు 20 : రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లోని అల్మాస్‌గూడకు చెందిన కందుల శ్రీ కాంతాచారిని.. మండలంలోని సంపట్రావుపల్లి గ్రామానికి చెందిన మేకల చంద్రయ్య నిర్బంధించి దాడి చేశాడని ఈ నెల 18న ఫిర్యాదు అందినట్లు ఎస్సై కొండూరు రాము తెలిపారు. ఎస్సై కథనం మేరకు.. చంద్రయ్య హైదరాబాద్‌లోని నందీ హి ల్స్‌లో నివాసం ఉంటూ వాటర్ ట్యాంకర్‌తో జీ వనం గడుపుతున్నాడు. శ్రీకాంతాచారి వాటర్‌ట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నిత్యం నీటిని విక్రయించగా వచ్చిన డబ్బులను లెక్కచేసి చంద్రయ్యకు ఇచ్చేవాడు. అయితే ఆరు నెలల నుంచి డ బ్బుల చెల్లింపులో తేడా వస్తున్నది. ఈ క్రమంలో కలెక్షన్ విషయంలో తేడా వస్తుందని.. మాట్లాడుదామని శ్రీకాంతాచారిని ఈనెల 11న కారులో చంద్రయ్య సంపట్రావ్పల్లికి తీసుకొచ్చాడు. తర్వా త తన ఇంట్లోని ఓ గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేశాడు. మరుసటి రోజు శ్రీకాంతాచారి భార్య అనిత, కుమార్తె శివాని, రెండు నెలల కు మారుడు వెంకటేశ్‌ను కూడా తీసుకొచ్చి నిర్బంధించాడు. అయితే 17వ తేదీన డయల్ 100కు బాధితులు ఫోన్ చేసి విషయాన్ని తెలిపారు. వెంటనే పో లీసులు గ్రామానికి చేరుకొని వారిని చికిత్స నిమి త్తం వీపనగండ్ల దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి వనపర్తి, హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం అ మ్మ దవాఖానలో చికిత్స పొందుతున్నట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చంద్రయ్య పరారీలో ఉన్నాడు. అయితే, స్థానికుల నుంచి మరో కథనం వినిపిస్తున్నది. చంద్రయ్య హైదరాబాద్‌లో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్బెడ్రూం ఇండ్లను ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వర కు డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. 150 మందితో డబ్బులు వసూలు చేయగా.. కలెక్షన్ వి షయంలో తేడా రావడంతో చంద్రయ్యను బం ధించాడని స్థానికుల కథనం.