
అన్ని వర్గాల వెన్నంటే ముఖ్యమంత్రి కేసీఆర్
అభివృద్ధిని బేరీజు వేసుకోండి
భవిష్యత్‌లో కార్పొరేషన్‌గా మహబూబ్‌నగర్
ఊహించని విధంగా అభివృద్ధి
ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
అభివృద్ధిని బేరీజు వేసుకోండి
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు19: 2014 కంటే ముందు.. తర్వాత రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకోవాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. అలాగే జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బ్రహ్మంగారి ఆలయంలో గణేశ్ ఉత్సవ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. పాత పాలమూరులో పీర్ల పండుగలో మంత్రి, ఎంపీ పాల్గొని పూజలు చేశారు. వీరన్నపేటలో పండుగ సాయన్న జయంతి వేడుకలకు వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో వ్యవసాయం పండగలా జరుగుతుందన్నారు. రైతు అభ్యున్నతికి పెద్దపీట వేసినట్లు చెప్పారు. కరోనా సమయంలో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి వరి కొనుగోలు చేశామని గుర్తు చేశారు. పాలమూరును ఎవరూ ఊహించని విధంగా తీర్చిదిద్దుతామన్నారు. దివిటిపల్లి, అంబట్పల్లిని మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో విలీనం చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు. భవిష్యత్‌లో మహబూబ్‌నగర్ కార్పొరేషన్డగా ఏర్పాటు కానున్నదన్నారు. దివిటిపల్లి ప్రాంతం ఐటీ కారిడార్, బైపాస్, జాతీయ రహదారితోపాటు రాబోయే రోజుల్లో కరివెన రిజర్వాయర్‌తో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందనున్నదన్నారు. రైతు వేదిక వద్ద మంత్రి మొక్కలు నాటారు.
సమాంతర అభివృద్ధే ధ్యేయం
మహబూబ్‌నగర్, ఆగస్టు19: సమాంతర అభివృద్ధే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రేమ్‌నగర్‌లో రూ.22లక్షలతో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతోపాటు రూ.10లక్షలతో ముదిరాజ్ కమ్యూనిటీ భవనం పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో ప్రేమ్‌నగర్‌కు వచ్చేందుకు కనీసం రహదారులు కూడా లేవన్నారు. ముదిరాజ్ భవనానికి రూ.10లక్షల మంజూరు చేసి మొదటి అంతస్తు కూడ నిర్మించి దానికి ఆదాయం వచ్చేలా షట్టర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం మహిళా భవనం నిర్మాణం పనులను మంత్రి ప్రారంభించారు.
గణేశ్ ఉత్సవాలు సంతోషంగా చేసుకుందాం
కులమతాలకు అతీతంగా గణేశ్ వేడుకలను సంతోషంగా సంబురంగా జరుపుకొందామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బ్రహ్మంగారి ఆలయంలో ఏర్పాటు చేసి గణేశ్ ఉత్సవ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలో సుమారు 45దేవాలయాలను పునరుద్ధరించి, నూతనంగా నిర్మించామన్నారు. మొదటి వేదపాఠశాల, బ్రాహ్మణ పరిషత్ ఇక్కడే నిర్మిస్తున్నామని, జిల్లాలో గోశాలలను విస్తీర్ణం చేసినట్లు తెలిపారు. గణేశ్ విగ్రహాల నిమజ్జనం వద్ద గజ ఈతగాళ్లు, పడవలు, లైటింగ్ బోట్లు, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
పీర్లకు ప్రత్యేక పూజలు
పాతపాలమూరులోని పీర్ల పండుగ వేడుకల్లో మంత్రిశ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీర్లకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు. ఆనాటి నుంచి కులమతాలకు అతీతంగా ప్రజలందరూ కలిసి మెలిసి చేసుకునే గొప్ప పండుగ అని సంబోధించారు.
పండుగ సాయన్న సేవలు చిరస్మరణీయం
వీరన్నపేటలోని పండుగ సాయన్న జయంతి వేడుకల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా పండుగ సాయన్నకు నివాళులర్పించారు. పండుగ సాయన్న సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా వ్యవసాయ అధికారి సుచరిత, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్‌గౌడ్, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, ఎంపీపీ సుధాశ్రీ, వైస్ ఎంపీపీ అనిత, కౌన్సిలర్ యాదమ్మ, రామాంజనేయులు, సర్పంచ్ జరీనా బేగం, నాయకులు రవీందర్‌రెడ్డి, శివశంకర్ పాల్గొన్నారు.