Thyroid Tablets | ట్యాబ్లెట్లను వాడుతున్నా కూడా.. థైరాయిడ్ అదుపులోకి రావడం లేదంటే కారణాలు ఇవే..!
ప్రస్తుతకాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో థైరాయిడ్ ఒకటి. ప్రతి పది మందిలో ఒకరు హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ సమస్యతో ఎక్కువగా ఇబ్బందిపడుతున్నారు. థైరాయిడ్ సమస్యను నియంత్రణలో ఉంచుకోవడానికి రోజూ కొన్ని లక్షల మంది థైరాయిడ్ ట్యాబ్లెట్లను వేసుకుంటున్నారని చెప్పవచ్చు.
Thyroid Tablets | ప్రస్తుతకాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో థైరాయిడ్ ఒకటి. ప్రతి పది మందిలో ఒకరు హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ సమస్యతో ఎక్కువగా ఇబ్బందిపడుతున్నారు. థైరాయిడ్ సమస్యను నియంత్రణలో ఉంచుకోవడానికి రోజూ కొన్ని లక్షల మంది థైరాయిడ్ ట్యాబ్లెట్లను వేసుకుంటున్నారని చెప్పవచ్చు. అయితే మనలో చాలా మంది థైరాయిడ్ ట్యాబ్లెట్లను వేసుకుంటున్నప్పటికీ దాని ఫలితాలు సరిగ్గా లేవని, ట్యాబ్లెట్లను వేసుకున్నప్పటికీ బరువు పెరగడం, అలసట, శక్తి లేకపోవడం, జుట్టు రాలడం, పొడి చర్మం వంటి సమస్యలతో బాధపడుతూనే ఉన్నామని చెబుతుంటారు. ట్యాబ్లెట్లను వేసుకున్నప్పటికీ సమస్యలతో ఎందుకు బాధపడుతున్నారు.. అలాగే థైరాయిడ్ గ్రంథి పనితీరు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కీలక విధుల నిర్వహణ..
మన శరీరంలో ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్ ఒకటి. గొంతు కింద భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఈ గ్రంథి ఉంటుంది. శరీరంలో శక్తి ఉత్పత్తి, వినియోగం, నిల్వలను నియంత్రించే కీలక విధులను ఈ గ్రంథి నిర్వర్తిస్తుంది. మెదడులోని పిట్యూటరీ గ్రంథి థైరాయిడ్ గ్రంథి కార్యకలపాలను నియంత్రిస్తుంది. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ టి-4 ( రక్తంలో ఎక్కువగా ఉండే హార్మోన్) , ట్రైయోడోథైరొనిన్ టి-3 ( కణ స్థాయిలో పనిచేసే క్రియాశీల హార్మోన్)ను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ల స్థాయిలను బట్టే థైరాయిడ్ నిర్దారణ, చికిత్స జరుగుతుంది. థైరాయిడ్ హార్మోన్లు తగినంత ఉత్పత్తి కాకపోవడం వల్ల హైపోథైరాయిడిజం సమస్య వస్తుంది. అలసట, బరువు పెరగడం, చలిని తట్టుకోలేకోవడం దీని లక్షణాలు. అయోడిన్ లోపం, థైరాయిడ్ గ్రంథి తొలగింపు, పిట్యూటరీ గ్రంథి లోపాలు, హషిమోటో అనే వ్యాధి కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది.
మైటోకాండ్రియా పనితీరు కీలకం..
ఇక థైరాయిడ్ హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల హైపర్ థైరాయిడిజం వస్తుంది. గ్రేవ్స్ వ్యాధి కారణంగా ఎక్కువగా ఈ సమస్య వస్తుంది. ఆందోళన, వేడిని తట్టుకోలేకపోవడం, బరువు తగ్గడం, గుండెదడ వంటి లక్షణాలు ఈ సమస్యలో కనిపిస్తాయి. సరైన మందులు ఉన్నప్పటికీ చాలా మందిలో అలసట, బరువు నియంత్రణలో లేకపోవడం, మానసిక సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. థైరాయిడ్ హార్మోన్ల తయారీ మైటోకాండ్రియా ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. మైటోకాండ్రియా అనేవి కణాల్లో శక్తిని ఉత్పత్తి చేసే నిర్మాణాలు. ఇవి పోషకాలను శక్తిగా మార్చి శరీరంలో అన్ని అవయవాలకు శక్తిని అందిస్తాయి. మైటోకాండ్రియా ఆరోగ్యం బాగుంటేనే థైరాయిడ్ హార్మోన్లు సరిగా తయారవుతాయి. మైటోకాండ్రియా శక్తి ఉత్పత్తి తగ్గితే హార్మోన్లు ఉన్నా వాటి ప్రభావం తగ్గుతుంది.
ఇలా చేయాలి..
థైరాయిడ్ హార్మోన్లు సరిగ్గా ఉన్నా కణాల శక్తి బలహీనంగా ఉంటే జీవక్రియ సరిగ్గా జరగదు. కనుక మందులు వాడినప్పటికీ సమస్యలు తగ్గవని నిపుణులు చెబుతున్నారు. థైరాయిడ్ సమస్యను హార్మోన్ల సమస్యగా కాకుండా కణశక్తి సమస్యగా చూడాలని వారు చెబుతునన్నారు. కణశక్తి స్థాయినిపెంచడానికి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఐరన్, విటమిన్ బి, మెగ్నీషియం లోపాలు లేకుండా చూసుకోవాలి. నిద్రలేమి, ఒత్తిడి వంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి. కండర వ్యాయామాలు చేయాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోవడం తగ్గించాలి. ట్యాబ్లెట్లను తీసుకోవడంతో పాటు జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల థైరాయిడ్ వల్ల వచ్చే ఇతర అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయని వైద్యులు తెలియజేస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

