
గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్
మహబూబ్‌నగర్, ఆగస్టు 18 : పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అందరికీ ఆదర్శప్రాయుడని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని తెలంగాణచౌరస్తాలో సర్వాయి పాపన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గౌడ సం ఘం జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్, విశ్రాం త ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సత్తూరి వెంకటస్వామిగౌడ్, సత్యనారాయణగౌడ్, పురుషోత్తంగౌడ్, సాయిలుగౌడ్, కృష్ణకుమార్‌గౌడ్, చక్రవర్తిగౌడ్, కృష్ణయ్యగౌడ్, ప్రతాప్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
జడ్చర్ల పట్టణంలో..
జడ్చర్లటౌన్, ఆగస్టు 18 : పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని బుధవారం జడ్చర్లలోని పూలే విగ్రహం దగ్గర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, కాంగ్రెస్ ఓబీసీసెల్ అధ్యక్షుడు ఎడ్ల బాలవర్దన్‌గౌడ్, బీసీసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణయాదవ్, రజక సం ఘం రాష్ట్ర నాయకుడు నడిమింటి శ్రీనివా స్, సీపీఐ, సీపీఎం నాయకులు కృష్ణ, తెలు గు సత్తయ్య, నర్సింహయాదవ్, శాగంటి రఘు, నాగరాజు, మండ్ల స్వామి, భీంరాజ్, శ్రీనివాస్‌గౌడ్, రాఘవేందర్ పాల్గొన్నారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, ఆగస్టు 18 : మండలకేంద్రంతోపాటు మల్కాపూర్, గార్లపాడ్ తదితర గ్రామాల్లో సర్దార్ సర్వాయి పాపన్నగౌ డ్ జయంతిని బుధవారం గౌడ సంఘం నా యకులు ఘనంగా జరుపుకొన్నారు. మండలకేంద్రంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మ న్ రాజేశ్వర్‌గౌడ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్ పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గౌడ సంఘం మండల అ ధ్యక్షుడు పవన్‌గౌడ్, మాజీ ఎంపీపీ మహేందర్‌గౌడ్, సత్యనారాయణగౌడ్, జగన్‌గౌడ్, విద్యాసాగర్‌గౌడ్, రాజుగౌడ్, రాజారాము లు, లక్ష్మీనారాయణగౌడ్, భరత్, భాస్కర్ పాల్గొన్నారు.
చిన్నచింతకుంట మండలంలో..
దేవరకద్ర రూరల్, ఆగస్టు 18 : సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని బుధవారం చిన్నచింతకుంట మండలకేంద్రంలో ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మోహన్‌గౌడ్, శ్రీనివాసులుగౌడ్, హన్మంతుగౌడ్, తిరుపతిగౌ డ్, కరుణాకర్, వెంకటేశ్, సురేశ్ ఉన్నారు.
నవాబ్‌పేట మండలంలో..
నవాబ్‌పేట, ఆగస్టు 18 : మండలకేంద్రంతోపాటు కొల్లూరు గ్రామంలో బుధవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మన్ మాడెమోని నర్సింహులు, సర్పంచ్ గోపాల్‌గౌడ్, ఎంపీటీసీ రాధాకృష్ణ, గౌడ సంఘం నాయకులు కృష్ణగౌడ్, వెంకటేశ్‌గౌడ్, దశరథంగౌడ్, రవీందర్‌గౌడ్, మల్కయ్యగౌడ్, చంద్రమౌళిగౌడ్, సత్యనారాయణగౌడ్, రామకృష్ణాగౌడ్, బాలరాజుగౌడ్, కొల్లూరు నాయకులు రఘుగౌడ్, రాజు, రఘు, వెంకటేశ్‌గౌడ్, గోపాల్‌గౌడ్, సత్యనారాయణగౌడ్, రమేశ్‌గౌడ్, రత్నబాబునాయక్, సేవ్యానాయక్, ఖాజా పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, ఆగస్టు 18 : మండలకేంద్రంలో గౌడ సంఘం నాయకులు సర్వాయి పాపన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆనంద్‌గౌడ్, భీమయ్యగౌడ్, కృష్ణయ్యగౌడ్, నారాయణగౌడ్, వెంకటయ్యగౌడ్, మల్లేశ్‌గౌడ్, రామకృష్ణాగౌడ్, శేఖర్‌గౌడ్, చంద్రకాంత్‌గౌడ్, వేణుగౌడ్, ఉదయ్‌గౌడ్ పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, ఆగస్టు 18 : సర్దార్ సర్వా యి పాపన్నగౌడ్ జయంతిని మండలకేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్నగౌడ్ చిత్రపటానికి వైస్‌ఎంపీపీ వెంకటాచారి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు గణేశ్‌గౌడ్, బాలయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.