
ఓ ఫొటో.. మధుర జ్ఞాపకం
శతాబ్దాల ఆనవాళ్లకు సజీవ సాక్ష్యం
నాడు బ్లాక్ అండ్ వైట్.. నేడు డిజిటల్
కొత్త పుంతలు తొక్కుతున్న ఫొటోగ్రఫీ
ఫొటో.. ఎన్నెన్నో అనుభూతుల సాక్ష్యం..
ఆలోచనలకు పదును పెడుతుంది..
సృజనాత్మకతకు అద్దం పడుతుంది..
కోటి భావాలను స్ఫురింపజేస్తుంది..
.. ఇలా ఎన్నో మధురానుభూతులకు శాశ్వత రూపంగా
చెప్పొచ్చు. ప్రపంచ మానవాళి జ్ఞాపకాల దొంతరలను
తట్టిలేపే శక్తి ఒక ఫొటోకే ఉన్నది. నోటితో చెప్పలేని
ఎన్నో భావాలు చిత్రంతో వ్యక్తం చేయొచ్చు. కన్ను
తెరిచింది మొదలు.. కన్ను మూసే వరకు సందర్భం
ఏదైనా సాక్షీభూతంగా నిలిచే ఛాయాచిత్రాలు కెమెరాకే
సాధ్యం. నాడు బ్లాక్ అండ్ వైట్‌లో.. నేడు డిజిటల్
విధానంలో ఫొటోగ్రఫీ రంగం కొత్త పుంతలు
తొక్కుతున్నది. నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ
దినోత్సవం సందర్భంగా కథనం.
నాడు బ్లాక్ అండ్ వైట్.. నేడు డిజిటల్..
కొత్త పుంతలు తొక్కుతున్న కెమెరా రంగం
నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం
కొందరు మాటలతో మైమరిపిస్తే..
ఇంకొందరు రాతలతో కదిలిస్తారు.. మరికొందరు
ఫొటోలతో ఈ రెండూ చేస్తారు. ఫొటోగ్రఫీ అనేది ఒక
అందమైన భాష. మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలకు సంకేతం
ఫొటో.. ఈ క్షణం మనది అనుకునేలోగా మరుక్షణం
కరిగిపోతుంది. అలాంటి కాలాన్ని తీపి గుర్తులుగా.. మధుర
క్షణాలుగా అపురూపంగా దాచిపెట్టి కలకాలం జ్ఞాపకంగా మిగిల్చేదే
ఫొటో. జీవితంలో ఏదో ఒక సందర్భంలో మధుర క్షణాలు, చేదు
అనుభవాలు వచ్చి పోతుంటాయి. వాటిని తిరిగి ప్రత్యక్షంగా
చూసుకున్నప్పుడు పొందే ఆనందం వర్ణించలేనిది. మధుర
స్మృతులను బంధించి తిరిగి మన కండ్ల ఎదుట ఆవిష్కరించే శక్తి
ఫొటోగ్రఫీకే సాధ్యం. నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా
కోట్లాది పదాల్లో వందల పేజీల్లో వర్ణించినా తెలియని విషయం ఒక్క ఫొటో చూస్తే తెలుస్తుంది. మధుర జ్ఞాపకాలను, చేదు అనుభవాలను దాచిపట్టి భావితరాలకు అందించే తి య్యని చిత్రమే ఫొటో. ప్రతి ఒక్కరి జీవితంలో అలాంటి జ్ఞాపకాలను అందించే ఫొటోలకు కేటాయించిన రోజే ప్రపంచ ఫొ టోగ్రఫీడే. మారుతున్న కాలానికి అనుగుణం గా ఫొటోగ్రఫీలో చాలా మార్పులొచ్చాయి. మొదట్లో రీల్ కెమెరాతో మొదలై నేడు డ్రోన్ కెమెరా, సెల్‌ఫోన్ వరకు సాంకేతికత పెరిగింది. వివాహాది శుభకార్యాల్లో ఫొటోలు స్టేటస్ సింబల్‌గా మారాయి. ఖర్చుకు వెనుకాడకుండా అనేక మంది పెండ్లిళ్లలో ఫొటోలను తీయిస్తున్నారు. దీంతో డిజిటల్ కెమెరాలతోపాటు డ్రోన్, క్రేన్ సాయంతో ఫొటోలను మరింత అందంగా తీసి అందిస్తున్నారు.
రెండు గ్రీక్ పదాల కలయికే ఫొటోగ్రఫీ. ఫొటో అంటే చిత్రం. గ్రఫీ అంటే గీయడం అని అర్థ్ధం. ఫొటోగ్రఫీ అంటే కాంతితో చి త్రాన్ని గీయడం అని అర్థ్ధం. తొలిసారిగా ప్యారిస్‌కు చెందిన జోసెఫ్ మియా ప్స్ లోహ ఫలకంపై దృ శ్యాన్ని నిలపగలిగారు.
1839లో మొట్టమొదటి సారిగా సర్జాన్హెల్లర్ ఫొటోగ్రఫీని ఉపయోగించారు. 1941లో విలియం హెన్రీ ఫాక్స్ ఫొటోగ్రఫీకి మూలమైన పాజిటివ్, నెగెటివ్ ఫిలింలను కనుగొన్నారు. మొ దట సూర్యరశ్మితో ఫొటోలను కడిగేవారు. కాలక్రమేణా విద్యుత్ శక్తితో ఫొటోలను తీయడం, ప్రింటింగ్ చేయడం మొదలైంది. ఆ కాలంలో నలుపు, తెలుపు ఫొటోలు మాత్రమే అందుబాటులో ఉండేవి. 1980 దశకంలో కలర్ ఫొటోగ్రఫీ అందుబాటులోకి వచ్చింది. ఫొటోగ్రఫీ లేని పూర్వ కాలంలో చిత్రకారుడు చేతిలోని కుంచె ఒక కెమెరాలాగా ఉపయోగపడింది. నాడు రాజు లు తమ ప్రతిబింబాలను చిత్రకారులచే వేయించుకునే వారు. అందమైన ప్రకృతి దృశ్యాలను త మ అంతఃపురంలో భద్రపరుచుకునేవారు. ఆ కా లంలో చిత్రకారులను అపరబ్రహ్మగా భావించేవారు. నాడు చిత్రకారులు యువరాణులు, యు వరాజుల ముఖారవిందాలను జీవకళ ఉట్టిపడేలా చిత్రీకరించి ఇస్తే వాటిని చూయించి పెండ్లి సంబంధాలు కలుపుకునే వారని చరిత్ర చెబుతున్నది. వందల ఏండ్ల కిందటే చిత్రాలకు అంతటి విలువ ఉండేది. డిజిటల్ కెమెరాల రాకతో 19వ శతాబ్ధం చివరలో డిజిటల్ ఫొటోగ్రఫీ అడుగు పెట్టింది. ఆటోమెటిక్ కెమెరాలు, అత్యధిక రెజల్యూషన్ కలిగిన లెన్స్‌లతో రకరకాల డిజిటిల్ కె మెరాలు మార్కెట్లోకి వచ్చాయి. డిజిటిల్ ఫొ టోగ్రఫీ అడుగుపెట్టాక ఫొటోలు తీయడం సులభంగా మారింది. దీంతో చాలా మంది నిరుద్యోగులు ఇదే వృత్తిగా మార్చుకొని ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా వెడ్డింగ్ ఫొటోగ్రఫీకి క్రేజ్ ఉన్నది. ఎంత ఖర్చు అయినా వెనుకాడడం లే దు. సాధారణంగా ఒక పెండ్లికి ఫొటోలు తీసి ఆ ల్బమ్ రూపొందిస్తే రూ.30 వేల నుంచి రూ.40 వేలు అవుతుంది. అధునాతన కెమెరాలు, లైటింగ్, ప్రత్యేక సెట్టింగ్‌లతో ఫొటోషూట్ చేస్తే రూ.1.50 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు ఖ ర్చు అవుతుంది. ఇక హైదరాబాద్, ఢిల్లీ, కొచ్చి వంటి నగరాల్లో సంపన్న వర్గా ల వారు ఏకంగా రూ.50 లక్షలు ఖర్చు పెట్టి సినిమా షూటింగ్‌ను తలపించేలా వెడ్డింగ్ ఫొటోషూట్ చేయిస్తున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో 60 వరకు ఫొటో స్టూడియోలు ఉండగా వంద మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. జి ల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో ఫొటోగ్రాఫర్లు జీవనోపాధి పొందుతున్నారు.
ప్రస్తుతం సెల్ఫీ ఫొటోగ్రపీ పీవర్ కొనసాగుతున్నది. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్క రూ సెల్ఫీలు తీసుకోవడం హాబీగా మార్చుకున్నారు. సెల్ఫోన్లు అడుగు పెట్టినప్పుడు 1.3 లేదా 2 మెగా పిక్సెల్ కెమెరాలు మాత్రమే ఉం డేవి. క్రమంగా 3జీ, 4జీ ఫోన్లు మార్కెట్లోకి రావడంతో 25 మెగా ఫిక్సెల్ కెమెరాలను ఫోన్లలో నిక్షిప్తం చేస్తున్నారు. దీంతో చిత్రా లు స్పష్టంగా వస్తున్నాయి. ఇక ఇంట్లో చి న్న శుభకార్యం జరిగినా సెల్ఫోన్లలో ఫొటోలు, వీడియోలు చిత్రికరించుకొని పదిలపరుచుకుంటున్నారు. మరికొంత మంది ప్రకృతి సోయగాలను, అందమైన దృశ్యాలను సెల్ఫోన్లలో బందిస్తున్నారు.