
జడ్చర్ల, ఆగస్టు 14 : జడ్చర్ల మున్సిపాలిటీలోని రంగనాయకస్వామి గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. శ్రావణ శనివారం సందర్భంగా రంగనాయకస్వామిని ఎమ్మెల్యే దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం రంగనాయకస్వామి గుట్టపై చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రావణమాసంలో రంగనాయకస్వామిని దర్శించుకునేందుకు భక్తులు గుట్టపైకి పెద్దసంఖ్యలో వస్తారని, వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందులు ఏర్పడకుం డా చూడాలన్నారు. రంగనాయస్వామి గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకుగానూ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గుట్టపైకి వచ్చే భక్తులతోపాటు పట్టణవాసులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు. వచ్చే శ్రావణమాసం వరకు అభివృద్ధి పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
నవాబ్‌పేట, ఆగస్టు 14 : పారిశ్రామిక రంగానికి ప్రభు త్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కాకర్జాల గ్రామశివారులో నూతనంగా నెలకొల్పిన మణిసార్ధక్ బయో ఇండస్ట్రీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తున్నదని తెలిపారు. యువత పరిశ్రమలను నెలకొల్పి తమతోపాటు, మరో 10మందికి ఉ పాధి కల్పించాలని సూచించారు. కాకర్జాలలో ఇండస్ట్రీని నెలకొల్పిన సమన్ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కొల్లూరు గ్రామానికి చెందిన పాంబండ రాములుకు సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ముత్యాల రవీందర్‌రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ మాడెమోని నర్సింహులు, సర్పంచులు అలివేలుపరుశరాం, గోపాల్‌గౌడ్, మాజీ ఎంపీపీ శీనయ్య, కోఆప్షన్ సభ్యుడు తాహెర్, మాజీ సర్పంచ్ అబ్దుల్‌అలీ, టీఆర్ఎస్ యువత మండల అధ్యక్షుడు మెండె శ్రీను, ప్రధాన కార్యదర్శి బీ రఘుగౌడ్, మెండె అంజయ్య, నర్సింహులు, నరేశ్ పాల్గొన్నారు.