
మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి : కలెక్టర్ వెంకట్రావు
దేవరకద్ర రూరల్, ఆగస్టు 14 : మొక్కల సంరక్షణను ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. శనివారం దేవరకద్ర తాసిల్దార్ కార్యాలయ ఆవరణలో మొక్క లు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలకు సకాలంలో నీటిని అందించి సంరక్షించాలని తెలిపారు. గ్రామాల్లో హరితహా రం మొక్కలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం ధరణి సేవలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ధరణి సేవలకు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు నిబంధనల మేరకు సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో తాసిల్దార్ జ్యోతి, డిప్యూటీ తాసిల్దార్ శివరాజు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.